ఫ్యాషన్ గొడుగులు


Sun,June 30, 2019 12:51 AM

వర్షాకాలం వచ్చేసింది.. ఇకనుంచి బయటకు వెళ్లాలంటే తడుస్తామేమోనన్న భయం. గొడుగు తీసుకెళ్దామంటే సౌకర్యంగా ఉండదు. గట్టిగా గాలి వస్తే ఎగిరిపోవచ్చు. ఇక బైక్ మీద వెళ్లాలన్నా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటాం. అయితే ఇకపై వర్రీ కావాల్సిన పనిలేదు. డ్రోన్ గొడుగులు, టోపీ గొడుగులు వచ్చేశాయ్.
anand-Umbrilla
పాత గొడుగులకు కాలం చెల్లింది. కొత్తగా క్యాప్ అంబరిల్లాలు వచ్చాయి. ఇవి చూడ్డానికి చాలా సింపుల్‌గాను, సౌకర్యవంతంగా, తక్కువ బరువుతో ఉండడంతో చాలామంది వీటిపై ఆసక్తి చూపుతున్నారు. వీటిని ధరిస్తే ఫ్యాషన్‌గానూ ఉంటున్నది. అంతేకాకుండా వీటిని క్యారీ చేయడం ఎంతో తేలిక. ఈ క్యాప్ అంబరిల్లాలపై మహీంద్ర కంపెనీ అధినేత ఆనంద్ మహీంద్రా ఇటీవల ట్వీట్ చెయ్యడంతో నెటిజన్లు వీటిపై ఆసక్తి చూపుతున్నారు. ఎప్పుడూ ఆసక్తికరమైన వీడియోలు, ఫొటోలతో ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉండే ఆనంద్ మహీంద్రా క్యాప్ అంబరిల్లా కొత్త వీడియోతో ముందుకొచ్చారు.

Umbrilla2
ఇదిగో టోపీ గొడుగులు వచ్చాయ్ చూడంటి అంటూ ట్వీట్ చేశాడు. ఈ సరికొత్త టోపీ గొడుగు.. తల భాగం నుంచి భుజాల వరకు కప్పి ఉంటుంది. వర్షం వచ్చినా తడిసే బాధ ఉండదు. డ్రోన్ గొడుగులు బ్లూటూత్ సాయంతో నడుస్తుంటాయి. ఒకవేళ బ్లూటూత్ పనిచేయకపోయినా హ్యాట్ అంబరిల్లా చక్కగా పనిచేస్తుందని ఆయన ట్వీట్ చేశారు. డ్రోన్ అంబరిల్లా కంటే.. టోపీ గొడుగులు ఎంతో బెటర్ అని ఆనంద్ మహీంద్రా ఈ వీడియోను ట్వీట్ చేశారు.

1074
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles