పిల్లలతో ప్రయాణమా..?


Fri,June 28, 2019 01:06 AM

ప్రయాణమంటేనే సహజంగా అలసట, ఒత్తిడి ఉంటాయి. అసౌకర్యం కూడా ఉండే తీరుతాయి. మరి అలాంటి ప్రయాణంలో పెద్దలే మంచాన పడతారు. ఆ ప్రయాణాన్ని చిన్న పిల్లలతో చేయాల్సి వస్తే చాలా జాగ్రత్తలు అవసరం.
tour-bigmain
మాట వింటూ, చెప్తే అర్ధం చేసుకునే పిల్లలైతే చెప్పినట్టు వింటారు. పిల్లలతో అనవసరమైన ఒత్తిడి ఎందుకు అనుకుని ఇష్టమైన ప్రదేశాలకు ప్రయాణాన్ని మానుకుంటే జీవితంలో ఎంతో కోల్పోయినట్లే. పిల్లలు మారాం చేస్తారని, రోగాలబారిన పడతారని వెనకడుగు వేస్తే అంతే సంగతులు. వారు ప్రయాణంలో తోడుంటే నవ్వులతో పాటు ఆనందాల జ్ఞాపకాలను కూడా మూటగట్టుకోవచ్చు. కాబట్టి వారితో ప్రయాణం మానేయాలన్న ఆలోచన రానివ్వకపోవడం మంచింది. అలాగని వారితో ప్రయాణం చేయడం అంత సులభం కూడాకాదు. అటువంటి సందర్భాలలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.

కెమెరా ఇవ్వండి :

ఊహ తెలిసిన పిల్లలైతే సమాజం మీద, ప్రయాణం మీద ఎంతోకొంత అవగాహన ఉంటుంది. అలాంటప్పుడు ఈ చిట్కా బాగా పని చేస్తుంది. పిల్లలకు కెమెరాలు ఇవ్వడానికి ప్రయత్నించండి. చుట్టుపక్కలనున్న ప్రదేశాల్లో వారికి నచ్చినవి అందులో బంధించమని వారిని ప్రోత్సహించండి. వారిని ఆకర్షించే వస్తువులపై మీరు ఓ కన్నేయండి. వాళ్ళ ఎత్తుల్లోంచి, వారిని ఆకర్షించే ఫొటోలు చూసిన తరువాత మీరు ఆశ్చర్యపోవచ్చు కూడా. జంతువులు, చెట్లు, రోడ్లు, ప్రకృతి వంటివి వాటిని వాళ్ల చూపు ద్వారా ఎలా ఉందో గమనించి వీలైతే సలహాలు, సూచనలు ఇవ్వండి. అవెలా ఉన్నాయో చెప్పి వారిని ప్రోత్సహించండి.

అసౌకర్యం అనిపించినా

aasoukryam
పిల్లలతో ప్రయాణమంటే చాలా ఓపిక, సహనం అవసరం. పిల్లలను కొత్త ప్రదేశాలకు తీసుకెళ్తే అక్కడ వారిని ఆకర్షించేవి చాలా ఉంటాయి. వాళ్లకు ఏదైనా నచ్చితే అంత తొందరగా విడిచిపెట్టరు. ఎయిర్‌పోర్ట్, బస్టాండులు, రైల్వే స్టేషన్లలో పిల్లలను ఆకర్షించేందుకు మరింత అందంగా ముస్తాబు చేసి పెడతారు. పర్యాటక ప్రదేశాల్లో అయితే చెప్పనక్కర్లేదు. అలాంటప్పుడు వాళ్లపై అరవకుండా అర్ధమయ్యేలా వివరించాలి. ఆయా ప్రాంతాల్లో ఏదైనా నచ్చినట్లు అనిపిస్తే అక్కడ కాసేపు ఉండగలగాలి. పిల్లలు నచ్చిన వాటితో సమయాన్ని గడుపుతున్నప్పుడు మీరు వారిని ఇబ్బంది పెట్టడం సరికాదు. మీకు కొంత అసౌకర్యంగా అనిపించినా, వారు నచ్చినట్టు ఉండేలా మీరు చేయగలగాలి.

వాతావరణ మార్పులు

vatavaranam
ఒక్కో జిల్లాకు ఒక్కో వాతావరణం ఉంటుంది. అలాంటిది రాష్ట్రాలు, బార్డర్లు దాటి పోతే అక్కడ ఎలాంటి వాతావరణం ఉంటుందో ముందే ఊహించలేం. అందుకే వాతావరణ మార్పులకు సిద్ధంగా ఉండాలి. వాతావరణ మార్పులు పిల్లల ఆరోగ్యంపై కచ్చితంగా పడతాయి. అందుకే, పిల్లల ఆరోగ్యంపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దాంతో, మీ పిల్లలు కొత్త ప్రదేశంలో కూడా ఎంతో సౌకర్యవంతంగా ఉంటారు. పిల్లలకు వేసే దుస్తుల విషయంలో అశ్రద్ధ వహించడం మంచిది కాదు.

మెడిసిన్స్ మర్చిపోవద్దు

medicine
ప్రయాణంలో మీ పిల్లల ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు వచ్చినా జాగ్రత్త పడాలి. సరిగ్గా తినకపోయినా, సాధారణంగా ఉండకపోయినా, ఎందుకు అలా ఉంటున్నారో తెలుసుకోండి. వీలైతే ప్రయాణానికి ముందు పిల్లల డాక్టర్‌ని సంప్రదించి మందులు తీసుకెళ్లండి. ఎందుకైనా మంచిది, మీతో పాటు ఫస్ట్ ఎయిడ్ సామాగ్రి పట్టుకెళ్ళడం మర్చిపోకండి.

మొబైల్ యాప్‌లు

mobaile-boy
ప్రయాణంలో యాప్‌లు చాలా అవసరం అవుతాయి. లొకేషన్ దగ్గర్నుంచి,ఫుడ్ వరకు అన్ని ఏర్పాట్లు, వసతులు యాప్‌లలో దొరుకుతున్నాయి. పిల్లల కోసం ప్రత్యేకించి బొమ్మలు తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ మీ పిల్లలు మిమ్మల్ని అసౌకర్యానికి గురి చేస్తుంటే గేమ్ యాప్ ఓపెన్ చేసి వారి చేతికి మొబైల్ ఇచ్చేయండి. పిల్లలు రంగులు వేసే పుస్తకాలను కూడా మీరు పట్టుకెళ్ళవచ్చు.

612
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles