సముద్రమట్టం.. సమాన ప్రాంతం


Fri,June 28, 2019 01:01 AM

చుట్టూ సముద్రం.. కనుచూపు మేర నీరు.. మేఘాలను తాకే అలలు.. అందమైన ద్వీపం. ఇన్ని ఆనందాల నడుమ కొన్ని అనివార్యాలు కూడా ఉంటాయి.
kiribati
కిరిబటి సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ఒక పట్టణం. పసిఫిక్ మహా సముద్రానికి మధ్యలో 33 సముద్ర దీవులు, పగడపు దిబ్బలు కలిగిన అద్భుత దీవి.ఆకాశం నుంచి మొదలు నేలపై ఉన్న సముద్రపు నీళ్లు కూడా నీలిరంగు వర్ణంలో ఉంటాయి. మధ్యన ఆకుపచ్చ అందాలతో చెట్లు ఏదో పెయింటింగ్ వేసినంత అద్భుతంగా దర్శనమిస్తాయి. 2100 నుంచి ఈ ప్రాంతంలో మనుషుల సంచరిస్తున్నాయి. ఇక్కడ ప్రాణుల మనుగడ సాగుతుందని తెలుస్తుంది. సముద్రపు అంచున గోడలా ఉన్న ఈ నగరం సముద్ర అలల తాకిడికి శిథిలావస్థకు చేరుకున్నది. దాంతో అక్కడ నివాసం ఉండే జనాలు వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. ఇప్పుడు అక్కడ చూడడానికి ఏమీ లేకున్నా బాగుంటుంది. ప్రకృతి విపత్తుల వల్ల ఆ ప్రాంతం అంతా జలమయం అయి ఛిన్నాభిన్నం అయిపోయింది. అక్కడ ప్రజల శ్రమ ఫలితంగా ఆ ప్రాంతం మళ్లీ పూర్వ స్థితికి వచ్చింది. ప్రపంచంలో సూర్యుణ్ణి మొదట ఇక్కడి వాళ్లు మాత్రమే చూడగలరు. కిరిబటి ప్రపంచంలోనే ఒక వింతైన సముద్ర దీవి. ఇప్పుడా ప్రాంతం అంతా టువాలుగా మారిపోయింది. అక్కడి ప్రభుత్వం ప్రజలకు ధైర్యాన్నిస్తూ పర్యాటకాన్ని, ఉపాధిని పెంచుతున్నది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాలతో కలిసి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నది. ఇవన్నీ పక్కన పెడితే ఈ ప్రాంతం సముద్ర మట్టానికి సమానంగా ఉంటుంది.

1523
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles