రుణం తీసుకొని.. ప్రయాణం


Fri,June 28, 2019 01:00 AM

ఎక్కడికైనా టూర్ వెళ్లాలంటే.. బ్యాంకులో ఎన్ని డబ్బులున్నాయని ఆలోచిస్తాం. ఎంత ఖర్చు అవుతుందో అని లెక్కలు తేల్చుతాం. అలాంటిది రుణాలు తీసుకొని ప్రయాణాలు చేయడానికి కదులుతున్నారంటే..
loan-travel
భారతీయుల్లో ఎక్కువ మంది రుణాలు తీసుకొని మరీ ప్రయాణాలు చేస్తున్నారని తాజా అధ్యయనంలో తేలింది. ప్రముఖ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ థామస్ కుక్ చేసిన అధ్యయనంలో ఈ అంశం వెల్లడయింది. వ్యాపారాల కోసం ప్రయాణం చేసే వారికన్నా 33 శాతం మంది ప్రయాణం కోసం రుణాలు తీసుకుంటున్నారని, వీరి సంఖ్య 50 నుంచి 60 శాతం పెరిగిందని ప్రకటించారు. రుణాలు తీసుకుంటున్న వారిలో 25 నుంచి 35 ఏండ్ల మధ్య వయస్కులే ఎక్కువ ఉంటున్నారన్న అంశాన్ని బయటపెట్టారు. 20 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసున్న యువతీ యువకులు నెలకు సగటున లక్ష రూపాయల చొప్పున రుణాలు తీసుకుంటున్నారు. గతేడాదితో పోల్చుకుంటే వేసవి సెలవుల్లో హాలీడే ట్రిప్పులకు వెళ్లిన వారి సంఖ్య 22శాతం పెరిగింది. ఈ అధ్యయనంలో రుణాలు తీసుకొని ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాలు తిరిగారు. ఆయా దేశాల్లో ఎలాంటి హాలీడే స్పాట్‌లకు వెళ్లి ఎంజాయ్ చేయాలన్న విషయాలను కూడా చెప్పారు.

1442
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles