మంచు పర్వతాలు.. మంచి అనుభూతులు


Fri,June 28, 2019 12:58 AM

1050 కిలోమీటర్లు ఎత్తైన కొండలు, మంచు పర్వతాల మధ్య నుంచి రెండు రోజులు ప్రయాణం చేస్తే ఎలా ఉంటుంది? అది అక్షరాల్లో వర్ణించలేం. మాటల్లో చెప్పలేం. అనుభవించి అనుభూతిని ఆస్వాదించాల్సిందే.
Bus-to-Leh
ఢిల్లీ నుంచి లేహ్ వరకు బస్సు సదుపాయాన్ని తిరిగి ప్రారంభించనున్నారు. అది మనాలి మీదుగా వెళ్తుంది. జూలై 1న ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. మంచు దుప్పటి కప్పేయడంతో ఇన్నాళ్లు ఈ దారిని మూసివేసారు. హిమాచల్ ప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్(హెచ్‌పీటీడీసీ) ఈ బస్సు సౌకర్యానికి సంబంధించిన ఏర్పాట్లను చూసుకుంటుంది. ప్రతిరోజూ ఒక బస్సును నడుపాలని భావిస్తున్నారు. పర్యాటకులను ఆకర్షించడానికి మార్గమధ్యంలో మనాలి రిసార్ట్స్ వంటివి చూపించనున్నారు. రద్దీ సమయాల్లో ప్రయాణికులు ఇబ్బంది పడకుండా అడ్వాన్స్ బుకింగ్ సర్వీస్‌ల వెసులుబాటు కల్పించారు. నాలుగు నెలల స్వల్ప విరామం తర్వాత ఈ బస్సు సర్వీస్ తిరిగి ప్రారంభం అవుతుండటంతో ప్రయాణికుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

521
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles