పాస్‌వర్డ్ మేనేజర్లు!


Wed,June 26, 2019 01:46 AM

చేతిలోకి సెల్లు వచ్చాకా, అందులోకి నెట్టు వచ్చాక చాలామంది జీవితం డిజిటల్ అయిపోయింది. పాకెట్‌లో మొబైల్, ఇంట్లో ల్యాప్‌టాప్, ఇంటర్నెట్ లేనిది రోజు గడవని పరిస్థితి వచ్చేసింది. మొబైల్ నుంచే బ్యాంక్ లావాదేవీలు, ఆన్‌లైన్ షాపింగ్‌లు,
ఇలా ఒక్కటేంటి అన్నీ కానిస్తున్నాం. మరి ఇవ్వన్నీ చేయడానికి ఒక గేట్‌వేను దాటాలి. అదే లాగిన్. మరి మీ డిజిటల్ భవిష్యత్‌ను కాపాడే ఈ లాగిన్ పాస్‌వర్డ్‌ను మీరు కాపాడుతున్నారా? వాటిని ఎక్కడ భద్రపరుచుకోవాలి?

banner
ఫేస్‌బుక్, జీమెయిల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్.. అవసరం ఏదైనా కావచ్చు కానీ దాన్ని వినియోగించుకోవాలంటే ఇంటర్నెట్ అకౌంట్ కచ్చితంగా ఓపెన్ చేయాలి. దాన్ని సురక్షితంగా ఉంచాలంటే పాస్‌వర్డ్ స్ట్రాంగ్‌గా ఉండాలి. కానీ, చాలామంది ఈజీగా గుర్తుంచుకోవడం కోసం సులభమైన పాస్‌వర్డ్‌లను ఎంచుకుంటారు. ఎన్నో రకాల అకౌంట్లకు ఒకేరకమైన పాస్‌వర్డ్ పెడుతుంటారు. అలాంటప్పుడు హ్యాకర్లు తమ పని ఈజీగా కానిచ్చే ప్రమాదం ఉంది. మరి మనం రోజూ వాడే అకౌంట్ల పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకోవడం కష్టమైనప్పుడు వాటిని సేవ్ చేసుకోవచ్చు. అందుకు పాస్‌వర్డ్ మేనేజర్లు ఉన్నాయి.

ఎలా పని చేస్తాయి..

పాస్‌వర్డ్ మేనేజర్లు పాస్‌వర్డ్‌లను భద్రపరచడంలో పెద్దపాత్ర వహిస్తాయి. ఈ అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేసుకొని అకౌంట్‌ను క్రియేట్ చేసుకోవాలి. మనం తరచూ ఓపెన్ చేసే సైట్ల యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌లను ఇందులో పొందుపర్చుకోవాలి. ఈ యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌లు అన్నీ క్లౌడ్ సెంట్రల్ డేటాబేస్‌లో స్టోర్ అయి ఉంటాయి. దీన్ని మనం యాక్సెస్ చేయడానికి ఒక మాస్టర్ పాస్‌వర్డ్‌ను తయారు చేయాలి. ఈ డేటా అంతా క్లౌడ్‌లో ఎన్‌క్రిప్ట్ అయి ఉంటుంది. కాబట్టి ఈ సర్వర్ హ్యాక్ అయినా కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఈజీగా ఎంటర్ చేయడానికి, ఈజీగా గుర్తుండడానికి చాలా మంది వీక్ పాస్‌వర్డ్‌లను వాడతారు. ఇది నష్టాన్ని కలిగిస్తుంది. పాస్‌వర్డ్ మేనేజర్‌లో మనం ముందే పాస్‌వర్డ్‌ను భద్రపరిచి ఉంచుకుంటే టైప్ చేయడానికి కష్టపడాల్సిన పని లేదు. ఇలా మన క్రెడెన్షియల్స్ సేవ్ చేసుకుంటే తరచూ లాగిన్ అయ్యే అకౌంట్‌లో మన పాస్‌వర్డ్ అటో ఫిల్ అవుతుంది.

banner-1

సేవ్ కార్డ్

ఆల్‌లైన్‌లో లావాదేవీలు అంటే మామూలు విషయం కాదు. బ్యాంక్ వివరాలు అన్నీ ఆన్‌లైన్‌లో పెట్టాల్సిందే. క్రెడిట్, డెబిట్, ఆధార్ వంటి కార్డు వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. లావాదేవీలు జరిపిన ప్రతిసారి ఈ వివరాలు అందించడం విసుగు అనిపించే పని. కొన్ని సైట్లలో సేవ్ కార్డ్ డిటైల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. కానీ వివరాలు అన్నీ ఇచ్చాక ఇన్‌సెక్యూర్ అనిపిస్తుంటుంది. దీని నుంచి బయటపడడానికి కూడా ఈ పాస్‌వర్డ్ మేనేజర్లు సహాయపడతాయి. ఇన్‌స్టాల్ చేసుకున్న పాస్‌వర్డ్ మేనేజర్‌ను ఓపెన్ చేసి ఫార్మ్ డేటా అనే కేటగిరిలో మన కార్డ్ వివరాలు అన్నీ సేవ్ చేసుకోవాలి. మనం ఎక్కడైనా కార్డు వివరాలు టైప్ చేయాల్సి వస్తే అప్పుడు మనకు సజెషన్ బాక్స్‌లో పాస్‌వర్డ్ మేనేజర్ నుంచి అటోమేటిక్ ఫిల్ కనిపిస్తుంది.

జనరేట్ చేస్తాయి..

ఏదైనా ఇంటర్నెట్ ఫ్లాట్‌పామ్‌లో అకౌంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు బలమైన పాస్‌వర్డ్ పెట్టుకోవాలని చాలా మందికి ఉంటుంది. కానీ ఏది పెట్టుకోవాలో అంత త్వరగా తట్టదు. అలాంటప్పుడు ఈ పాస్‌వర్డ్‌మేనేజర్లు బాగా ఉపయోగపడతాయి. మనకు ఎన్ని అక్షరాలు కావాలి, ఎన్ని నంబర్లు ఉండాలి, ఎన్ని అల్ఫాబెట్స్ ఉండాలో చెపితే చాలా ఒక స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌ను జనరేట్ చేసి ఇస్తుంది. తర్వాత వీలైనప్పుడు మనం దాన్ని మార్చుకోవచ్చు.

banner-2

మాస్టర్ పాస్‌వర్డ్, డివైజ్ జాగ్రత్త

పాస్‌వర్డ్ మేనేజర్‌లో మన డేటా అంతా సేవ్ చేసుకుంటాం. డిజిటల్ వివరాలన్నీ అందులో ఉంటాయి. దీన్నంతటినీ యాక్సెస్ చేయడానికి ఒక మాస్టర్ పాస్‌వర్డ్ అవసరం ఉంటుంది. ఈ లాగిన్ వివరాలు ఇతరులకు చిక్కకుండా చూసుకోవాలి. పాస్‌వర్డ్ మేనేజర్ ఇన్‌స్టాల్ అయి ఉన్న ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్ మీరు తప్ప ఎవరూ వాడకుండా చూసుకోవాలి. ఒకవేళ అలా ఇతరులకు ఇవ్వాల్సి వచ్చిన పాస్‌వర్డ్ మేనేజర్ అకౌంట్ నుంచి లాగౌట్ అయి ఇవ్వాలి. ఇలా జాగ్రత్త వహించకపోతే మన గోప్యతను అప్పనంగా ఇతరుల చేతిలో పెట్టిన వాళ్లం అవుతాం.

టాప్5 పాస్‌వర్డ్ మేనేజర్లు

తరచూ ఆన్‌లైన్ అకౌంట్లను ఓపెన్ చేయడానికి పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా పాస్‌వర్డ్ మేనేజర్లు ఉపయోగపడతాయి. యూజర్ల కోసం ఇంటర్నెట్‌లో పాస్‌వర్డ్ మేనేజర్లు అందుబాటులో ఉంటాయి. వాటిలో ముఖ్యమైనవి. లాస్ట్‌పాస్, డాష్లేన్, రోబోఫామ్, కీపాస్ పాస్‌వర్డ్‌సేఫ్, స్టికీపాస్‌వర్డ్. ఆయా రకాల ఈ అప్లికేషన్లు అన్నీ బాగా పని చేస్తాయి.వీటిలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఉచితంగా, మరొకటి ప్రీమియం. వీటిలో మనం దేన్నయినా వాడుకోవచ్చు. ఈ అప్లికేషన్లు ఉపయోగించి మన డేటాను కాపాడుకోవచ్చు..

...?వినో..

365
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles