తొలి ఎలక్ట్రిక్ బైక్


Wed,June 26, 2019 01:45 AM

అదిరే ఫీచర్లతో ఎలక్ట్రిక్ ఏఐ ఎనేబుల్ బైక్ మొదటిసారి భారత మార్కెట్‌లోకి వచ్చింది. రివోల్ట్ RV 400 AI పేరుతో ఇటీవలే ఇది లాంచ్ అయింది. స్మార్ట్ ఫీచర్లు, డైనమిక్ డిజైనింగ్‌తో రాయల్ లుక్‌ను కలిగిఉంది. మైక్రోమ్యాక్స్ కో ఫౌండర్, మాజీ సీఈఓ రాహుల్ శర్మ దీన్ని విడుదల చేశారు.
Revolt
రివోల్ట్ RV 400 బైక్‌లో మోట్ స్టార్ట్ సపోర్ట్, ఆన్ లైన్ రీచార్జ్ ఎబిలిటీ,ఎగ్జాస్ట్ నోట్ ఆప్షన్లు, రైడింగ్ మోడల్స్ వంటి ఫీచర్లతో ఈ బైక్ ఆకట్టుకుంటున్నది. ఈ బైక్ బుకింగ్‌లు కూడా జూన్ 25 నుంచి ప్రారంభమయ్యాయి. ఢిల్లీ కస్టమర్లు రూ. 100 టోకెన్ పై రివోల్ట్ కంపెనీ వెబ్‌సైట్ లేదా అమెజాన్ వెబ్‌సైట్ ద్వారా బైక్‌ను బుక్ చేసుకోవచ్చు. వచ్చే నాలుగు నెలల్లో బైక్‌ల ఉత్పత్తిని NCR, పుణె, బెంగళూరు, హైదరాబాద్, నాగపూర్, అహ్మదాబాద్, చెన్నై నగరాల్లో విస్తరించనుంది.
ఫీచర్లు : రియల్ టైం ఇన్ఫర్మేషన్, డైయాగ్నిస్టిక్స్, జియో ఫెన్సింగ్, బైక్ లొకేటర్, ఆర్టిఫిషియల్ ఎగ్జాస్ట్ సౌండ్ సిస్టమ్ ఉన్నాయి.

ఈ-బైక్ లో నాలుగు ఎగ్జాస్ట్ నోట్ ఆప్షన్లు ఉన్నాయి. ఏది కావాలంటే అది ఎంచుకోవచ్చు. కస్టమైజ్‌డ్ నోట్ ఆప్షన్ కూడా ఎంచుకోవచ్చు. డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ కన్సోల్, రీజనరేటివ్ బ్రాకింగ్ సిస్టమ్, బ్లూ టూత్ కనెక్ట్‌విటీ ఉంది. దీంట్లో మూడు రకాల రైడింగ్ మోడల్స్ ఎకో, సిటీ, స్పోర్ట్ ఉన్నాయి. సింగిల్ చార్జ్ చేస్తే 156 కిలోమీటర్ల వరకు వస్తుంది. ఇండియాలో ఇతర ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాలను ఆఫర్ చేసే కంపెనీల కంటే రెండింతలు ఎక్కువగా రివోల్ట్ కంపెనీ అందిస్తున్నది. కాంపాక్ట్ డిజైన్‌తో పాటు బోల్ట్ ఆన్ సబ్ ఫ్రేమ్ ఉంది. డిస్క్ బ్రేక్స్, లెడ్ హెడ్ లాంప్స్, బైక్ వీలర్స్‌తో కలిపి 8 స్పోక్ యూనిట్లతో కలిసి ఉంటుంది. హ్యాండల్ బార్ దగ్గర రియర్ బ్రేక్ లెవల్‌ను కూడా అమర్చారు. ఆల్ ఇంటర్నెట్ ఫీచర్లను అనుమతించేలా 4G LTE SIMను కంపెనీ సెట్ చేసింది. రివోల్ట్ బైక్ కు సంబంధించి ఆండ్రాయిడ్, iOS Apps, గూగుల్ ప్లే, Apple యాప్ స్టోర్లలో త్వరలో రిలీజ్ కానున్నాయి.

1755
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles