నదికి జీవం పోసిన మహిళలు


Wed,June 26, 2019 01:44 AM

ప్రభుత్వాలు ఎన్ని కార్యక్రమాలు నిర్వహించినా ఇతర రాష్ర్టాల్లో ప్రజలకు నీరు అందడం కష్టతరం అవుతున్నది. ఈ క్రమంలో మహిళలు పలుగు పార అందుకున్నారు. ఒక్కో మహిళ భగీరథ ప్రయత్నం చేస్తూ కనుమరుగైపోయిన నదికి జీవం పోస్తున్నారు.
river
15 ఏండ్ల కిందట తమిళనాడులోని 24 జిల్లాల్లో తాగునీటికి ప్రధానవనరు నాగనథి నది. కాలక్రమంలో నది కనుమరుగై పోయింది. ముఖ్యంగా వెల్లూరు జిల్లా ప్రజలు ఈ నదిపై ఎక్కువగా ఆధారపడి జీవనం సాగించే వారు. ఇటీవల ఆ జిల్లాలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. దీంతో మొత్తం 20 వేల మంది మహిళలు నాగనథి నదికి పునరుజ్జీవం కల్పించే ప్రయత్నం చేశారు. ఐదేళ్ల పాటు ఐదు కోట్ల రూపాయల వ్యయంతో సాగిన వీరి ప్రయత్నంతో నాగనథి జలకళను సంతరించుకున్నది. 2014లో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి కేంద్రం చేయూతనిచ్చింది. అనంతరం ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నాగనథి నది పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయి. స్థానిక 20 వేల మంది మహిళలు కూలీలుగా మారి పరీవాహక ప్రాంతంలో 3500 చెక్ డ్యామ్‌లు, రీచార్జ్ వెల్స్ నిర్మించారు. ప్రస్తుతం నదికి పూర్వవైభవం తీసుకొచ్చేలా కృషి చేశారు. శాటిలైట్ మ్యాపింగ్ సాయంతో జల వనరుల ఉద్యోగుల బృందం నదిని గుర్తించింది. తర్వాత దాని భౌగోలిక స్వరూపం, పరీవాహక ప్రాంతం, వర్షపాతం వివరాల ఆధారంగా ప్రణాళిక రచించి నదికి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చారు.

838
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles