డీఫాల్ట్ యాప్స్ డిలీట్ చేయండిలా..


Wed,June 26, 2019 01:43 AM

మొబైల్‌లో పాత అప్లికేషన్ల వల్ల కొత్త అప్లికేషన్లకు చోటు దొరకదు. ఫోన్ మెమొరీ ఫుల్ అయితే కొత్త యాప్ ఇన్‌స్టాల్ కాదు. అన్నీ అవసరమైన యాప్స్ ఉన్నప్పుడు ఏది డిలీట్ చేయడమో అర్థం కాదు. అలాంటప్పుడు డీఫాల్ట్ యాప్స్‌ను డిలీట్ చేద్దాం అనుకున్నా అవి కావు. మరి మనకు అవసరం లేని డీఫాల్ట్ యాప్స్‌ను డిలీట్ చేయాలంటే ఎలా?..
apps
-దీని కోసం మొదట మీరు కంప్యూటర్ ఉపయోగించాల్సి ఉంటుంది.
-కంప్యూటర్‌లో మీరు కింగోరూట్ అనే సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ చేయాలి.(www.kingoapp.com)
-తర్వాత మీ మొబైల్లో సెట్టింగ్స్ ఓపెన్ చేసి అప్లికేషన్స్ పార్ట్ ఓపెన్ చేయాలి.
-అందులో మీకు DEVELOPMENT పార్ట్ కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేయండి. అందులో DEBUGGING ఆప్షన్ ఉంటుంది. దాన్ని యాక్టివేట్ చేయండి .
-ఇప్పుడు మీ మొబైల్‌ను డేటా కేబుల్ ద్వారా కంప్యూటర్‌కు కనెక్ట్ చేయండి..
-5 నిమిషాలు వెయిట్ చేయండి. కింగోరూట్ ఆటోమేటిక్‌గా మీ మొబైల్ డ్రైవర్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటుంది.
-తర్వాత Root బటన్ క్లిక్ చేయండి.
-మీ మొబైల్ రూటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఆ సమయంలో మొబైల్‌ని కదిలించొద్దు. రూట్ కంప్లీట్ అయిన తర్వాత ఒక మెసేజ్ వస్తుంది.
-అప్పుడు ఫినిష్ బటన్ క్లిక్ చేయండి.
-ఇప్పుడు మొబైల్‌ను కంప్యూటర్ నుంచి డిస్కనెక్ట్ చేయండి.
-ఆ తర్వాత మొబైల్లో ప్లేస్టోర్ నుంచి Explorer యాప్ ఇన్‌స్టాల్ చేయండి.
-ఇందులో మీకు కిందకు వెళ్తే System అని ఫోల్డర్ ఉంటుంది.
-అందులో App అనే ఫోల్డర్ ఉంటుంది. ఆన్‌స్టాల్ అయి ఉన్న యాప్స్ అందులో కనిపిస్తాయి. ఉపయోగం లేని వాటిపై లాంగ్ ప్రెస్ చేస్తే ఆప్షన్స్ వస్తాయి. డిలీట్ ఆప్షన్స్ క్లిక్ చేయండి. అప్పుడు ఫోన్ మెమరీ ఫ్రీ అవుతుంది.

426
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles