యువత ఏం ఆలోచిస్తున్నది?


Wed,June 26, 2019 12:54 AM

యువత ఏం ఆలోచిస్తున్నది? ఆస్తులూ.. అంతస్థులు ఇవేనా? కాదు.. మానవత్వం గురించి ఆలోచిస్తుంది అని చెప్తున్నారు నిపుణులు. వర్ణం, జాతి, దేశం అంటూ విడిపోవడం ఎందుకు అని నేటి యువత ఆలోచిస్తుందట. వివాహాలు కూడా కమ్యూనిటీ పరంగా కాకుండా ఇష్టాన్ని బట్టి చేసుకుంటున్నారని ఓ సర్వేలో వెల్లడైంది.
Youth
యువత ఏం ఆలోచిస్తున్నది అనే అంశంపై అమెరికాలోని మిచిగాన్ యూనివర్సిటీ పరిశోధకులు అధ్యయనం చేశారు. దీంట్లో భాగంగా3లక్షల 13 వేల మంది యువతీ యువకులను పరిశీలించారు. వీరిలో చాలామంది కులం, జాతి, వర్ణం కంటే కలిసి ఉండటానికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు తేలింది. అందుకే కులాంతర వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయట. వివాహం గురించి ప్రస్తావన వచ్చినప్పుడు 75% మంది కమ్యూనిటీ కంటే హ్యుమానిటీకే ఓటేశారట. చదువు, ఉద్యోగం, వివాహం అనేవి జీవితానికి సంబంధించినవి కాబట్టి ఇక్కడ కూడా హద్దులు వేసుకొని బతికితే ప్రయోజనం ఏంటి అనే ఆలోచనా ధోరణితో నేటి యువత ఉన్నట్లు వారు పేర్కొన్నారు. దక్షిణాది రాష్ర్టాల యువత కంటే ఉత్తరాది రాష్ర్టాల యువత ఈ అభిప్రాయంతో ఎక్కువగా ఉన్నట్లు ఆ సర్వే ద్వారా తెలిసింది.

956
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles