ఆనందంలోనే అసలు జీవితం


Wed,June 26, 2019 12:54 AM

చదువు అయిపోగానే ఏం చేస్తాం? ఏదో ఒక ఉద్యోగం చూసుకొని లేదా వ్యాపారం పెట్టుకొని డబ్బులు సంపాదించే పనిలో పడతాం. కానీ దాని కోసం ఎన్నో ఒత్తిళ్లు ఎదుర్కొంటాం. ఈ ఒత్తిళ్ల మధ్య సంపాదిస్తూ మనం ఎంత ఆనందంగా ఉండగలుగుతాం? ఎంత సంతృప్తి పొందుతాం? అంటున్నది మ్యాగ్డలేన్ అల్లాన్ అనే యువతి.
Magdalene-Allan
మనం మనకు నచ్చినట్లు కాకుండా అవతలి వాళ్లు మనకు ఇచ్చిన అవకాశాలకు అనుగుణంగా జీవిస్తున్నాం అంటున్నది మ్యాగ్డలేన్ అల్లాన్. ఆమె నర్సింగ్ గ్రాడ్యుయేట్. అందరూ ఆమెను మ్యాగీ అంటారు. తన తండ్రి డేవిడ్ మాన్యవలన్ సమాజ సేవకుడు. నర్సింగ్ అయిపోగానే ఎంబీబీఎస్ చేసి డాక్టర్ కావాలన్నది తండ్రి కోరిక. మ్యాగీ కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నది. కానీ చదువుకొని ఉద్యోగం లేని అమ్మాయిలను చూస్తే మ్యాగీకి బాధనిపించేది. తాను డాక్టర్ ఆలోచన వదిలేసి అలాంటి వారికి మార్గదర్శి కావాలనుకొని ట్రూ హ్యాపీనెస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ సంస్థను స్థాపించింది. ఆనందంగా ఎలా ఉండొచ్చు? ఆనందాలను ఆర్థిక హోదా డామినేట్ చేయకుండా ఎలా ఎదగాలి? పోటీ ప్రపంచంలో మహిళగా సాధికారత ఎలా సాధించాలి? వంటి అంశాలు బోధిస్తూ ప్లేస్‌మెంట్స్ అవకాశాలు కల్పిస్తున్నది మ్యాగీ.

2024
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles