ఏసీతో పని తగ్గుతుంది!


Fri,June 21, 2019 01:28 AM

పనికి.. ఏసీకి లింక్ ఏంటీ అనుకుంటున్నారా? ఆఫీసుల్లో ఏసీ వాడకం ఎక్కువ ఉంటే.. ఆడవాళ్ల పని ఉత్పాదకత మీద దాని ప్రభావం ఉంటుందని ఒక పరిశోధన చెబుతున్నది.
WOMEN-EMPLOYEES
శిరీష ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగిని. రోజూ ఆఫీస్‌కు చలినుంచి ఉపశమనం పొందే జర్కిన్‌తో వెళ్తుంది. ఒక్క శీతాకాలంలోనే కాదు. కాలమేదైనా ఆమె వీటి కోసం రెండు బ్యాగులు తీసుకెళ్లాల్సిందే! ఎందుకంటే ఆఫీసుల్లో ఏసీని ఉపయోగించి ఉష్ణోగ్రతల్ని క్రమంగా తగ్గిస్తారు. ఉష్ణోగ్రతల్ని తగ్గించడం కారణంగా పని మీద శిరీష ఏకాగ్రత పెట్టలేకపోతుంది. ఇలా తనొక్కొతే కాదు.. చాలామంది పని సరిగా చేయలేకపోతున్నారని ఒక పరిశోధనలో తేలింది. చలి కారణంగా మహిళల ఆలోచనల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. పని ఉత్పాదకత తగ్గిపోతుందని అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్‌మెంట్ ఇంటెలిజెన్స్ సంస్థ వెల్లడించింది. ఈ సంస్థ అమెరికాలోని కొన్ని కంపెనీల్లోని 543 మంది ఉద్యోగులు పరిశోధన చేశారు. ఏసీ, ఏసీ లేని ప్లేస్‌లో పని చేసిన పురుషుల్లో ఎలాంటి మార్పులు లేవు. కానీ మహిళల్లో మాత్రం మార్పుల్ని వారు గమనించారు. ఏసీ ఎక్కువ ఉంటే మహిళల మెదడు చురుగ్గా పనిచేయదని, సహజ ఉష్ణోగ్రతల మధ్య వారి మెదడు బాగా పనిచేస్తుందని తేలింది. కాబట్టి మహిళలు ఎక్కువ పని చేసే కంపెనీల్లో ఏసీ వాడకం తక్కువ ఉంటే అక్కడ పని ఉత్పాదకత పెంచవచ్చు అని ఈ సంస్థ తెలియచేస్తున్నది.

1481
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles