ఆలివ్ ఆయిల్‌ను చర్మానికి రాస్తున్నారా?


Fri,June 21, 2019 01:27 AM

ఇంటి చిట్కాలు పాటించి అందాన్ని రెట్టింపు చేసుకోవాలని కొందరు మహిళలు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. అందులో కొన్ని ప్రయత్నాలు బెడిసి కొట్టే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆలివ్ ఆయిల్‌ను చర్మానికి రాయడం వల్ల నష్టాలు ఉన్నాయి అవేంటంటే..
beauty
-ఆలివ్ ఆయిల్ చర్మానికి వాడడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు కలగవచ్చు. ఆలివ్ ఆయిల్‌ను కొద్ది సమయం పాటు చర్మంపై ఉంచిన తర్వాత చర్మం ఆయిల్‌ను గ్రహించుకుంటుంది. ఫలితంగా పీల్చుకున్న ఆయిల్ చర్మంపై ఒక పొరలాగా ఏర్పడుతుంది. దీనిపై దుమ్ము, ధూళి వంటివి పేరుకుపోయి మొటిమలకు కారణం అవుతాయి.
-జిడ్డు చర్మం కలిగి ఉండే వారు ఆలివ్ ఆయిల్‌ను వాడకూడదు. ఒకవేళ ఆలివ్ ఆయిల్ వాడినట్లయితే, సీబం ఉత్పిత్తి అధికమవుతుంది. ఫలితంగా చర్మం ఎరుపుగా మారుతుంది. దురద, స్కిన్ రాషెస్ వంటి సమస్యలు ఎదురవుతాయి.
-ఆలివ్ ఆయిల్‌ను చర్మంపై రాయడం వల్ల అలర్జీలు ఏర్పడతాయి. అయినప్పటికీ దురద పెట్టిన చోట మళ్లీ ఆలివ్ ఆయిల్ రాస్తే దురద శరీరంపై వ్యాప్తి చెందుతుంది. దురద ప్రారంభదశలోనే వైద్యుడిని సంప్రదించడం మేలు.
-ఆలివ్ ఆయిల్‌లో ఒలియిక్ ఆమ్లం ఉంటుంది. ఇది సహజ తేమను తొలిగిస్తుంది. పొడి చర్మం కలిగి ఉండే వారు ఆలివ్ ఆయిల్‌ను వాడకూదు. చర్మ వైద్య నిపుణుల సలహా మేరకు మాత్రమే చర్మానికి సంబంధించిన ఉత్పత్తులను, ఆయిల్‌లను వాడాలి.
-నవజాత శిశువులకు ఆలివ్ ఆయిల్ పూయడం మంచిది కాదు. ఎందుకంటే ఒక్కొక్కరి చర్మం ఒక్కోరకంగా ఉంటుంది. శిశువు చర్మం లేతగా, మృదువుగా ఉంటుంది కాబట్టి ఆలివ్ ఆయిల్‌తో మసాజ్ చేయకపోవడమే మంచిది. ఆలివ్ నూనెతో మసాజ్ చేస్తే శిశువుల చర్మం కందిపోయే అవకాశం ఉంది.

1348
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles