నాజూకైన చర్మం మీ సొంతం


Wed,June 19, 2019 11:35 PM

beauty
ముఖ వర్ఛస్సు బాగుండాలని మహిళలు చేయని ప్రయత్నం ఉండదు. అందం కోసం రకరకాల క్రీమ్స్ వాడుతుంటారు. అయితే మార్కెట్లో దొరికే కాస్మొటిక్స్ వల్ల ఉన్న అందం పాడైపోతుంది. ఈ చిన్న చిట్కాలు పాటించి ఇంట్లోనే సహజ సిద్ధమైన ఫేస్‌వాష్‌లు, ఫేస్ మాస్క్‌లు తయారుచేసుకోవచ్చు.
-తేనె, ఆల్మండ్ ఆయిల్ చర్మం మెరిసేలా చేస్తాయి. ఒక టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ తీసుకుని, దానికి 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ కలిపి పేస్టులా తయారు చేసుకుని దానిని ముఖానికి రాసుకుకోవాలి. 10 నుంచి 15 నిమిషాలు మర్దన చేయడం వల్ల చర్మం నిగారింపును సంతరించుకుంటుంది.
-టమాటా చర్మ సౌందర్యాన్ని పెంచే ఏజెంట్‌గా పనిచేస్తుంది. 2 టేబుల్ స్పూన్స్ ఓట్మీల్‌ను తీసుకుని తర్వాత ఒక టమాటాను రసం చేసి కలపాలి. ఓట్మీల్ బాగా మెత్తగా గుజ్జుగా అయ్యేవరకు పేస్టుగా చేసుకోవాలి. తర్వాత దానిని ముఖానికి వేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
-ఒక టేబుల్ స్పూన్ శనగపిండిని తీసుకుని దానికి 2 టేబుల్ స్పూన్స్ పాలు, 2 లేదా 3 చుక్కల నిమ్మరసం వేసుకుని పేస్టు చేసి తర్వాత దాన్ని ముఖానికి పట్టించుకోవాలి. 15 నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలాగే కొన్ని వారాల పాటు చేస్తే చర్మానికి నిగారింపు వస్తుంది.
-ఆలూ ముక్కలు ైస్లెసెస్‌గా కోసుకుని వాటిని ముఖంపై ఉంచుకోవాలి. కళ్ల కింద నల్లటి వలయాల దగ్గర మర్దన చేయాలి. ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా వారం పాటు చేస్తే మంచి ఫలితాల్ని పొందవచ్చు.

1119
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles