చెస్ చరిత్రలో చెరగని ముద్ర


Wed,June 19, 2019 11:35 PM

చెస్ క్రీడలో ఎంతోమంది పేరుగాంచిన మహిళలు ఉన్నప్పటికీ కాదిల్కర్ సిస్టర్స్ మాత్రం చెరగని ముద్ర వేశారు. ముంబైకి చెందిన ఈ సిస్టర్స్ చెస్‌లో అనూహ్య మార్పులకు కారణం అయ్యారు.
chess
దేశంలో మొదటిసారి చెస్ చాంపియన్ పోటీలు నిర్వహించినప్పుడు ముగ్గురి మహిళల హవా నడిచింది. ముంబైకి చెందిన జయశ్రీ, వాసంతి, రోహిణి ముగ్గురు కాదిల్కర్ స్టిస్టర్స్‌గా పరిచయం. 1974-1980 మధ్యలో చెస్ పోటీల్లో వీరిని మించిన వారు లేరు. పురుషులతో కలిసి పోటీ చేయడానికి ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు సాహసాలే చేశారు. చెస్‌లో ఈ తరహా పోటీని, లింగ భేదం లేకుండా క్రీడను ఆడేందుకు పోరాడారు కూడా. ఈ ముగ్గురు ప్రస్తుతం క్రీడారంగంలో లేకపోయినా ప్రపంచ చెస్ రికార్డుల్లో ఉన్నారు. వాసంతి 1990లోనే 2120 రేటింగ్‌ను సాధించారు. ప్రస్తుతం మన దేశపు టాప్ చెస్ మహిళా ప్లేయర్ ర్యాంక్ 2558లో ఉంది. జయశ్రీ 1979లో చెస్ ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్స్ ఫిడే టైటిల్‌ను గెలుచుకున్న మొదటి మహిళగా రికార్డు సృష్టించింది. ఈమె వాసంతి రేటింగ్‌ను అందుకోకపోయినా ఎన్నో టోర్నమెంట్‌లను సాధించింది. రోహిణి చెస్‌లో విశిష్టమైన ప్రతిభ కనబరించింది. ముఖ్యంగా లింగ భేదం ఉండకూడదని కొట్లాడింది. ముంబైలో జరిగిన ఓ పోటీలో పురుషులతో ఆడడానికి అనుమతి రాకపోతే కోర్డు వరకూ వెళ్లింది. తర్వాత 1977లో మహారాష్ట్ర ప్రభుత్వం ఛత్రపతి శివాజీ అవార్డును అందించింది. 1980లో అర్జునా అవార్డును అందుకుంది. ఈ అవార్డును అందుకున్న మొదటి మహిళా ప్లేయర్‌గా ఈమె రికార్డు సృష్టించింది. ఫిడేలో 1987 నాటికి ఆమె రేటింగ్ 2220 ఉంది. వీరి కథ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయి చక్కర్లు కొడుతున్నది.

567
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles