గాజు సీసాలు తెచ్చి.. రంగులు అద్ది!


Wed,June 19, 2019 11:34 PM

రోడ్డు మీద వెళ్తుంటే... గాజు సీసాలు, ప్లాస్టిక్ బాటిళ్లు కనిపిస్తే మనం ఏం చేస్తాం చెత్త అనుకొని పక్కకు తోసేస్తాం. కానీ ఒక్కసారి ఆలోచించి వాడుకుంటే ఆ చెత్త నుంచే ఎన్నో అద్భుతాలు తయారు చేయవచ్చు. అలాగే చేసింది కర్ణాటకలోని మంగళూర్‌కు చెందిన యువతి.
megha
ఫల్గుణి నదికి శివారులో నివసించేది మేఘా మెండొన్ అనే 23 ఏండ్ల యువతి. తరచూ ఈ నది చుట్టూ చెత్తను, గాజు సీసాలను గమనించేది. వాటిని రోజూ చూస్తూ వెళ్తుంటే ఎన్నో ఆలోచనలు వచ్చేవి. వాటిని ఉపయోగించుకోవాలనుకుంది. అప్పుడే చక్కటి ఆలోచన వచ్చింది. గాజు సీసాలు సేకరించి వాటికి రంగులు అద్దడం ప్రారంభించింది. అందమైన బొమ్మలు, ఆకట్టుకునే సందేశాలు పెయింట్ వేసింది. చూడగానే ఆకట్టుకొనే విధంగా ఉండడంతో వాటికి చక్కటి స్పందన వచ్చింది. వాటిని ఫ్రెండ్స్‌కు, ఇతరులకు విక్రయించడం ద్వారా డబ్బులు, ప్రశంసలు అందుకుంటున్నది. దీంతోపాటు ఆ నది శివారులో పేరుకుపోయిన సీసాలను సేకరించడానికి వర్క్‌డ్రైవ్ చేపట్టింది. వారం రోజుల్లో సుమారు 900 సీసాలు సేకరించింది. దీంతో పాటు వృథాగా పోతున్న ఈ సీసాల వల్ల కలిగే నష్టాలేంటో తెలియజేస్తున్నది. అందుకోసం వర్క్‌షాప్‌లను కూడా నిర్వహిస్తున్నది. స్కూల్, వీధుల్లో పిల్లలకు వీటి మీద చిత్రాలను గీయడం నేర్పుతున్నది. కిందటి నెలలో నిర్వహించిన వర్క్‌షాప్‌కు నలభై మంది విద్యార్థులు హాజరయ్యారు. సీసాలను ఎలా సేకరించాలి, ఎలా శుభ్రం చేయాలి, వాటిపై ఎలా పెయింటింగ్ వేయాలో శిక్షణ ఇస్తున్నది.

424
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles