టైటానిక్ - 2 సిద్ధమయ్యింధి!


Thu,June 20, 2019 12:46 AM

టైటానిక్ తెలియని వారున్నారా? టైటాన్ వాచ్ తెలియని వారుంటారు కానీ టైటానిక్ తెలియని వారుండరు. మొదటిది ప్రమాదంలో మునిగిపోయి సినిమాగా రూపొందింది. ఇప్పుడు రెండో టైటానిక్ రయ్యి రయ్యిమంటూ దూసుకెళ్లడానికి వస్తున్నది. దాని ప్రత్యేకతలు, విశేషాల సమాహారమే ఈ కథనం..
Titanic
ప్రపంచ చరిత్రను తవ్వితే అత్యంత విషాదకర ఘట్టాల్లో ఈ నౌక మునక కూడా ఒకటి. దాని ప్రయాణం ఆధారంగా వచ్చిన టైటానిక్ సినిమా ప్రపంచాన్ని ఓ ఊపు ఊపింది. వాస్తవిక సంఘటనకు కొంత కల్పన జోడించిన ఆ సినిమా ఆల్‌టైమ్ హిట్. టైటానిక్ విషాదం చోటుచేసుకున్న శతాబ్ద కాలం తర్వాత ఇప్పుడు టైటానిక్-2 నౌక ప్రయాణానికి సిద్ధమవుతున్నది. దాదాపు అన్ని రంగులను, హంగులను రంగరించుకొని ప్రపంచానికి పరిచయం కానున్నది.

నౌకాయాన చరిత్రలో టైటానిక్‌ది ప్రత్యేక స్థానం. దాన్ని ఒక ఘటనగా, ప్రమాదంగా చూసే వారికన్నా, సినిమాగా రూపొందాక ఎక్కువ జనాలకు చేరువయింది. అదో బ్రిటిష్ ప్యాసింజర్ నౌక. పూర్తి పేరు ఆర్.ఎమ్.ఎస్ .టైటానిక్. హర్లాండ్ అండ్ వోల్ఫ్ అనే నౌకా నిర్మాణ సంస్థ తయారు చేసిన మూడు నౌకల్లో ఇది ఒకటి.

1912 ఏప్రిల్ 14న ఈ భారీ నౌక అట్లాంటిక్ మహా సముద్రంలో సౌతాంప్టన్ నుంచి న్యూయార్క్ సిటీకి వెళ్తూ మంచు కొండను ఢీకొట్టింది. చిన్న రంధ్రం పడి నీరంతా నౌకలోకి చేరి టైటానిక్ నీటిలో మునిగిపోయింది. ఆ దుర్ఘటనలో 1517 మందికిపైగా జల సమాధి అయ్యారు. ప్రపంచాన్ని శోకసంద్రంలో ముంచిన పెను విషాదాల్లో ఇదొకటి. వందేళ్లు దాటినా దాని ప్రభావం, దాని మీద జరిగిన ప్రచారం ఇప్పటికీ కళ్ల ముందు కదలాడుతూనే ఉంటుంది.

ఒకేలా ఉండాలని..

గతమెప్పుడూ గమ్మత్తుగా ఉంటుంది. ప్రమాదవశాత్తు నీటిలో మునిగిన టైటానిక్ నౌక ఎన్నో యేండ్ల పాటు, కొన్ని వందల కుటుంబాలను శోకసంద్రంలో నెట్టివేసింది. మునిగిపోయిన టైటానిక్ జ్ఞాపకాలతో ఆస్ట్రేలియాకు చెందిన బ్లూ స్టార్ లేన్ అనే సంస్థ తాజాగా టైటానిక్-2 నౌకను రూపొందిస్తున్నది. ఇప్పటికే నౌక తయారీ పూర్తికావొచ్చిందని తెలుస్తున్నది. ఒలింపియా శ్రేణికి చెందిన టైటానిక్-2 కూడా ఒకప్పటి టైటానిక్‌లాగే కనిపించేలా, దాన్ని మైమరిపించేలా ఉండేందుకు సంస్థ ప్రయత్నిస్తున్నది. అందులో భాగంగానే పాత టైటానిక్ మునిగిపోయాక దొరికిన దాని అవశేషాలను కొన్నింటిని కొత్త నౌకలో అలంకరించింది. పాత టైటానిక్‌లో ప్రయాణం విషాదాంతమైన నేపథ్యంలో టైటానిక్-2లో బ్లూ స్టార్ లేన్ సంస్థ రక్షణకు అధిక ప్రాధాన్యమిచ్చింది. మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలనే సంకల్పంతో అత్యాధునిక వస్తువులను వాడుతున్నది. కొత్త నౌకలో అధిక సంఖ్యలో లైఫ్‌బోట్లు, అత్యాధునిక రాడార్, నేవిగేషన్ సాంకేతికత వంటివి అందుబాటులోకి రానున్నాయి. ఏదైనా ఊహించని ప్రమాదం జరిగినా ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు తలెత్తకుండా ఇవి రక్షణగా నిలువనున్నాయి. దీనివల్ల తక్కువ ప్రాణనష్టం జరుతుందని అంచనా వేస్తున్నారు.

titanicgrafic
కొత్త టైటానిక్‌లో 835 క్యాబిన్లు ఉంటాయి. వాటిలో 2,435 మంది ప్రయాణికులు కూర్చోవచ్చు. 2022లో ఈ నౌక తన తొలి ప్రయాణ ప్రస్థానాన్ని ప్రారంభించనుంది.

అదే మార్గంలో..

కొత్త టైటానిక్‌లో 835 క్యాబిన్లు ఉంటాయి. వాటిలో 2,435 మంది ప్రయాణికులు కూర్చోవచ్చు. 2022లో ఈ నౌక తన తొలి ప్రయాణ ప్రస్థానాన్ని ప్రారంభించనుంది. తొలి టైటానిక్ ప్రయాణించిన మార్గంలోనే టైటానిక్-2 ను కూడా నడుపాలని బ్లూ స్టార్ లేన్ నిర్ణయించింది. తొలి టైటానిక్‌లో ప్రయాణిస్తూ ప్రేమలో పడిన రోస్-జాక్‌ల తరహాలో ఈసారి ఎవరైనా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తారా? అన్న అంశం మీద ఎక్కువ చర్చ జరుగుతున్నది. ఇలాంటి విషయాలన్నీ ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే ఈ ఘటన మీద పదుల సంఖ్యలో సినిమాలు, వందల సంఖ్యలో సినిమాలు వచ్చాయి.

2524
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles