ఈ టైర్లు పంక్చర్ కావు!


Thu,June 20, 2019 12:39 AM

ప్రయాణించే కారు టైరు పంక్చర్ అయితే మధ్యలోనే ఆగిపోతుంది. మెకానిక్ అందుబాటులో ఉంటే ఓకే లేదంటే, ఆ బాధ ఇంతా అంతా కాదు. టైర్లలో గాలి ఎక్కువగా ఉన్నా, తక్కువగా ఉన్నా తంటే. అదే గాలితో పని లేని టైర్లు అందుబాటులోకి వస్తే ఆ సమస్యే ఉండదు. అందుకే శాస్త్రవేత్తలు అత్యాధునికి పరిజ్ఞానంతో గాలితో పనిలేకుండానే టైర్లను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
airless-tyres
ట్యూబ్‌లు పేలడం, పంక్చరవ్వడం వంటి కష్టాలను తప్పించేందుకు శాస్త్రవేత్తలు సరికొత్త టెక్నాలజీతో ఎయిర్‌లెస్ టైర్లను రూపొందించారు. ఇప్పుడున్న టైర్లతో వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో పంక్చైర్లెన వాహనాలు రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణ నష్టం జరుగుతున్నది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అమెరికాకు చెందిన దిగ్గజ సంస్థ జనరల్ మోటార్స్, మిషెలిన్ అనే సంస్థతో కలిసి కొత్తరకం టైర్లను అభివృద్ధి చేసింది. ఈ టైర్లతో గాలి తగ్గడం, పెరుగడం, పంక్చరవ్వడం వంటి సమస్యలేమీ తలెత్తవు. ఎందుకంటే అవి ఎయిర్‌లెస్ టైర్లు కనుక. ఈ టైర్లకు ఉప్టిస్ అని పేరు పెట్టారు. (యుపిటిఐఎస్) యూనిక్ పంక్చర్ ప్రూఫ్‌టైర్ సిస్టమ్. 2014లోనే ఈ టైర్లను అభివృద్ధి చేసే దిశగా మిషెలిన్ కృషి చేసింది. అందుకోసం ప్రత్యేకంగా 50 మిలియన్ డాలర్ల బడ్జెట్ కేటాయించి పరిశోధనలు జరిపిస్తున్నది. ఇటీవల మిషెలిన్‌తో జనరల్ మోటార్స్ జత కట్టింది. ఈ రెండు సంస్థల భాగస్వామ్యంలో ఉప్టిస్ టైర్లను చెవ్రోలెట్ బోల్ట్ ఈవీ వంటి వాహనాలకు అమర్చి పరీక్షిస్తున్నారు. 2024 నాటికి ఉప్టిస్ టైర్లు అందుబాటులోకి రానున్నాయి.

3041
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles