వాసన పసిగట్టకపోతే..?


Thu,June 20, 2019 12:39 AM

వయసు మళ్లిన తర్వాత వినికిడి శక్తి తగ్గడం, వెంట్రుకలు తెల్లబడడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. అయితే ఇటీవల ఓ సర్వేలో వాసన చూసే శక్తి తగ్గితే చావుకు దగ్గరయినట్లేనని వెల్లడైంది. మనిషి వాసన చూసే శక్తికీ, మరణానికీ సంబంధం ఏమిటనే సందేహం మీకు కలుగవచ్చు.
sence-of-smell
వాసన చూసే శక్తిని బట్టి మనిషిలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయనే అంశంపై 1997-98ల మధ్య కాలంలో అమెరికాలోని పిట్స్‌బర్గ్‌లో ఉంటున్న వృద్ధులను ఎంచుకొని వారిపై అధ్యయనం చేశారు. ఇందులో 70 నుంచి 79 ఏండ్ల వయసు కలిగిన 3 వేల మంది వృద్ధులు పాల్గొన్నారు. అధ్యయనంలో భాగంగా వివిధ రకాల వాసనలను చూపించి వాటిని గుర్తించమంటూ వారందరి వాసన పసిగట్టే సామర్థ్యాన్ని లెక్కించారు. అలా దాదాపు 13 ఏండ్ల పాటు వారిపై ప్రయోగాలు చేశారు. ఈ అధ్యయన కాలంలోనే 3వేల మంది వృద్ధుల్లో 1200మంది చనిపోయారు. వాసన పసిగట్టే పరీక్షలో తక్కువ సామర్థ్యం కలిగిన వారిలో 46 శాతం మంది ఈ 10 ఏండ్లలో చనిపోయారు. ఈ సర్వేను 1997లో ప్రారంభించి 2014లో ముగించారు. ఈ ప్రయోగాలకు సంబంధించిన ఫలితాలను ఏనల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ అనే జర్నల్‌లో ప్రచురించారు. వాసన పరీక్షల్లో తక్కువ పాయింట్లు తెచ్చుకున్న వారు త్వరగా చనిపోయారని పరిశోధకులు వెల్లడించారు. ఈ ప్రయోగం ద్వారా వాసనకు, మరణానికి సంబంధం ఉన్నదని శాస్త్రవేత్తలు నిరూపించారు.

1450
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles