తామేమీ తక్కువ కాదని..


Wed,June 19, 2019 01:18 AM

transwomen-inspiring
లింగమార్పిడి చేయించుకున్న వారంటే సమాజంలో చిన్న చూపు ఉంది. వారిని అవహేళన చేస్తూ, పలు విధాలుగా వేధిస్తున్నారు. సమాజంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని తమిళనాడులోని కోయంబత్తూర్‌కు చెందిన ట్రాన్స్‌జెండర్ మహిళ సంయుక్త విజయన్ వినూత్న పరిష్కారమార్గాన్ని చూపింది. అమెరికాలో రెండున్నరేండ్లు ఇంజినీర్‌గా పనిచేసిన సంయుక్త తిరిగి భారతదేశానికి వచ్చి సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నది. చిన్నప్పటి నుంచి ఆమెకు ఫ్యాషన్ రంగమంటే చాలా ఇష్టం. పలురకాల డిజైన్లను రూపొందించడంలో కొన్ని మెళకువలను తెలుసుకున్నది. ట్రాన్స్‌జెండర్లు కూడా అందరిలా మనుషులే, బతకడానికి వారికి ఎటువంటి పని లభించకపోవడంతోనే వ్యభిచారం చేస్తున్నారు. అందుకే వారిని ఆ కూపం నుంచి విముక్తి కల్పించేందుకు పలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో బెంగళూరులో టౌట్ స్టూడియోపేరుతో బొటిక్‌ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా నలుగురు ట్రాన్స్‌జెండర్లకు ఉపాధి అందిస్తున్నది. ఇతర దేశాల్లో లింగ వివక్షత అనేది కనిపించదు. అక్కడ ఎవరికివ్వాల్సిన గౌరవం వారికి ఉంటుందని సంయుక్త చెబుతున్నది. భారతదేశంలో మాత్రమే లింగవివక్షత ఎక్కువని ఆమె అంటున్నది. దివ్య, రోసా, శక్తి , విజ అనే నలుగురు ట్రాన్స్‌జెండర్లకు సంయుక్త డిజైనింగ్ రంగంలో శిక్షణ ఇచ్చి వారికి తన బొటిక్‌లోనే ఉపాధి కల్పించింది. తన బొటిక్‌లో ఎక్కువ మంది ట్రాన్స్‌జెండర్లకు పని కల్పించి వారి భవిష్యత్‌కు భరోసా కల్పిస్తున్నది. పెండ్లి సమయంలో అవసరమైన దుస్తులు, ఆభరణాలు అద్దెకు ఇస్తూ వినూత్న సేవలనందించేందుకు శ్రీకారం చుట్టింది. నేటితరం యువత అభిరుచులకు తగిన విధంగా పలు డిజైన్లను రూపొందిస్తున్న సంయుక్త అనతి కాలంలోనే మార్కెట్‌లో మంచి బ్రాండ్‌ను క్రియేట్ చేసింది.

1259
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles