పాదాలు జరభద్రం


Wed,June 19, 2019 01:17 AM

foot
సాధారణంగా మహిళలు ఎక్కువగా నీటిలోనే రోజూవారీ పనులు చేయాల్సి ఉంటుంది. ఈ కారణంగా వారి పాదాలు పాడవుతుంటాయి. వర్షాకాలంలో ఈ సమస్య తీవ్ర రూపం దాలుస్తుంది. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే చాలు పాదాల పగుళ్ల నుంచి ఉపశమనం పొందవచ్చు.
-వర్షాకాలంలో వీలైనంత వరకు షూస్ ధరించకూడదు. ఎందుకంటే వర్షంలో తడిసినప్పుడు లేదా వర్షపు నీటిలో నడిచినప్పుడు షూస్ బాగా తడిసి పాదాలకు ఇన్‌ఫెక్షన్ సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి షూస్ కాకుండా తేలికగా ఉండే స్లిప్పర్స్, శాండిల్స్ వేసుకోవాలి.
-వర్షంలో తడిసినా వర్షపు నీటిలో నడిచినా ఇంటికి రాగానే పాదాలను శుభ్రంగా కడుక్కోవాలి. అనంతరం తడి లేకుండా తుడుచుకోవాలి. ముఖ్యంగా కాలి వేళ్ల మధ్య, చేతి వేళ్ల మధ్య తడిగా ఉండకుండా చూసుకోవాలి. పడుకునే ముందు పాదాలకు మాయిశ్చరైజర్ రాసుకోవాలి.
-వారానికి ఒకసారి పెడిక్యూర్ చేసుకోవాలి. ఒక చిన్న టబ్‌లో గోరువెచ్చటి నీళ్లు వేసి.. దానిలో నిమ్మరసం, హ్యాండ్ వాష్ లిక్విడ్ వేసి బాగా కలపాలి. అందులో పాదాలు పెట్టి.. స్క్రబ్బర్‌తో పాదాలను శుభ్రం చేసుకోవాలి. గోర్లను శుభ్రం చేసుకోవడానికి హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉపయోగించవచ్చు. పాదాలను తడిలేకుండా తుడిచి మాయిశ్చరైజర్‌ను ఐప్లె చేయాలి.
-వర్షాకాలంలో ఎవ్వరికైనా పాదాలకు పగుళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని పాదాలకు ఉన్న మృతచర్మం తొలగిపోయేలా స్క్రబ్బర్‌తో రుద్దాలి. డెడ్ స్కిన్‌ను తొలగిస్తే పాదాల పగుళ్లను అరికట్టినట్లే.
-డయాబెటిస్‌తో బాధపడుతున్న వారు పాదాలపట్ల మరింత శ్రద్ధ వహించాలి. ఫంగల్ ఇన్‌ఫెక్షన్ సోకితే వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లి చికిత్స తీసుకోవాలి. ప్రతి రోజు రాత్రి నిద్రించే ముందు సబ్బుతో పాదాలను కడిగి తుడిస్తే మంచిది.

1922
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles