ప్రయాణాలే పాఠాలుగా మారాయి


Wed,June 19, 2019 01:17 AM

travelling
పిల్లలు చురుగ్గా, తెలివిగతేటలతో పెరుగాలంటే పెద్ద స్కూల్లో చదివిస్తే సరిపోదు. ఇంట్లో కూర్చుని టీవీ చూస్తే నాలెడ్జ్ అంతకన్నా పెరుగదు. పిల్లలకు నేర్పించే ప్రతి విషయాన్ని ప్రాక్టికల్‌గా చూపించాలంటున్నది ఈ మహిళ.
బెంగళూరుకు చెందిన లక్షనా, శ్రావణ్ దంపతులకు ఒక్కగానొక్క కొడుకు. అతని పేరు నైతిక్. నాలుగేండ్ల నైతిక్‌కు ఫుట్‌బాల్ అంటే చాలా ఇష్టం. తన అబ్బాయి చదువుతో పాటు అన్ని విషయాల్లో ముందుండాలి అనుకున్నది లక్షనా. రోజూ ఉదయాన్నే నైతిక్ మూడు గంటల పాటు ఆటలు ఆడుకుంటాడు. ఈ విధంగా నైతిక్ ఆటలు ఆడిన రోజు చాలా యాక్టివ్‌గా కనబడుతుండేవాడు. కొన్ని రోజులు ఇవేం చేయకుంటే బాగా నిద్రపోయేవాడు. ఆ సమయంలో డల్‌గా అయ్యేవాడు. అందుకే నైతిక్‌ను నిమిషం కూడా ఖాళీగా ఉంచకుండా పాటలు, డాన్స్, రంగులు వేయడం నేర్పిస్తున్నది తల్లి. తన పిల్లాడిలాగే ఇతర పిల్లలూ ఉంటారని అనుకుంది. అందుకే స్కూల్ సెలవుల సమయంలో ఇతర పిల్లలను కూడా పర్యాటక ప్రదేశాలకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ ట్రిప్‌లకి.. ట్రిప్‌స్టర్ బడ్డీస్ పేరుతో నెలకోసారి లక్షనా ఫ్రెండ్స్ అందరూ వారి పిల్లలతో టూర్ ప్లాన్ చేస్తుంటారు. ఈ విధంగా ప్రత్యక్షంగా చూసిన ప్రదేశాల నుంచి భూగోళశాస్త్రం, చరిత్ర, గణితం, భాషా, సంస్కృతి, సహనం వంటి విషయాలు సమాజం పట్ల అవగాహన కల్పిస్తుంటారు. ఇప్పటికి మూడు ట్రిప్‌లు అయ్యాయి. భవిష్యత్‌లో మరిన్ని ట్రిప్పులు వేసే దిశగా లక్షనా ఆలోచిస్తున్నది.

541
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles