కిస్మిస్ తింటున్నారా?


Wed,June 19, 2019 01:16 AM

ఆరోగ్యానికి కావాల్సిన పోషకాహారం డ్రైఫ్రూట్స్‌లో బాగా ఉంటుంది. ముఖ్యంగా డ్రైఫ్రూట్స్‌లో మనకు బాగా తెలిసింది కిస్మిస్. వీటిని తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టేయవచ్చని వైద్యులు చెబుతున్నారు.
kismis
-ఎండుద్రాక్షలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి దీన్ని తినడం వల్ల రక్తహీనత సమస్య పరిష్కారమవుతుంది. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కిస్మిస్ తినడం వల్ల దంత సమస్యలు, చిగుళ్ల వ్యాధులు తగ్గుతాయి. కాలేయ పనితీరునూ మెరుగుపరుస్తుంది.
-మూత్రపిండాలు, పేగు, మూత్రాశయం సమస్యలతో బాధపడుతున్న వారికి ఎండు ద్రాక్ష ఎంతగానో ఉపయోగపడుతుంది. ఊపిరితిత్తుల పనితీరు సరిగ్గాలేనివాళ్లు ఎండు ద్రాక్షను రోజూ తింటే ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు.
-పిల్లల్లో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరిగేందుకు ఎండుద్రాక్ష బాగా పనిచేస్తుంది. వీటిలో పొటాషియం, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. దాంతో ఇవి ఆర్ధరైటిస్‌తో బాధపడేవాళ్లకు ఎంతో మేలు చేస్తాయి. ఇందులోని ఫినాలిక్ పదార్థాలు వివిధ రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటాయి.
-తరచూ ఎండుద్రాక్ష తింటే రక్తపోటు, మధుమేహం అదుపులో ఉంటాయి. ఆకలి వేసినప్పుడు స్నాక్స్ కంటే వీటిని తినడం మేలు. ఎండు ద్రాక్షలోని పీచు.. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. ఆహారం సరిగా జీర్ణం కాని వారు రోజూ కిస్మిస్ తింటే మంచిది.
-రోజూ గుప్పెడు ఎండుద్రాక్ష తింటే రోగనిరోధక శక్తిపెరుగుతుంది. మలబద్దకం, డయేరియా నివారణకు కిస్మిస్ బాగా పనిచేస్తుంది. శరీరంలో మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు ఇది సాయం చేస్తుంది.

3708
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles