కరివేపాకుతో ప్రయోజనాలెన్నో


Wed,June 19, 2019 01:15 AM

curry-leaves
కూరల్లో కరివేపాకు వేస్తారు. కంచంలోకొచ్చేసరికి మాత్రం కరివేపాకే కదాని తీసిపారేస్తారు. కానీ కరివేపాకు చేసే మేలు అంతా ఇంతా కాదు. కరివేపాకు వల్ల లాభాలు తెలిస్తే ఇకపై అస్సలు తీసిపారేయరు!
-బరువు తగ్గాలనుకునేవారు ఆహారంలో కరివేపాకును తప్పకుండా చేర్చుకోవాలి. రోజూ నాలుగు కరివేపాకులను తినడం వల్ల శరీరంలో కొవ్వు నిల్వలు కరుగుతాయి. తద్వారా బరువు తగ్గేందుకు అవకాశం ఉన్నది.
-కరివేపాకులో లభించే ల్యూటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచి రోగాల బారిన పడకుండా కాపాడుతుంది. దీనిలో ఫోలిక్ యాసిడ్, నియాసిన్, బీటా కెరటిన్, ఇనుము, కాల్షియం, ఫాస్పరస్, పీచు, మాంసకృత్తులు, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి.
-కరివేపాకును రోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల అజీర్తి, మలబద్దకం వంటి సమస్యలు దూరమవుతాయి. బాలింతల్లో పాలు బాగా పడడానికి కరివేపాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. చిన్నారుల ఆహారంలో కరివేపాకును భాగం చేస్తే వారి ఎదుగుదల బాగుంటుంది.
-కిడ్నీరోగులు కరివేపాకును ఎక్కువగా తింటే త్వరగా కోలుకోవచ్చు. కంటి సమస్యలకు కూడా కరివేపాకు మెడిసిన్‌లా పనిచేస్తుంది. రోజూ దీన్ని ఆహారంలో భాగంగా తీసుకుంటే వయసుతో పాటు వచ్చే కంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు.

3937
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles