ఇంటికి డిజిటల్ సొబగుల్


Wed,June 19, 2019 01:13 AM

digital
ఉదయాన్నే టైంకు నిద్రలేపే అలారమ్ ఉన్నట్టే ఇంటి నుంచి బయటకు వెళ్లగానే ఆటోమేటిక్‌గా ఆఫ్ అయ్యే లైట్లుంటే ఎలా ఉంటుంది?కుక్కర్ వేడెక్కగానే విజిల్ వచ్చినట్టే .. కూర వండుతున్నప్పుడు స్టేటస్‌ను చూపిస్తే ఎంత బాగుంటుంది.
అద్దం ముందు నిల్చుంటే బయట వాతావరణాన్ని బట్టి ఎలాంటి మేకప్ వేసుకోవాలో చెప్పే మిరర్లు ఉంటే క్రేజీగా ఉంటుంది కదా!అలాంటి స్మార్ట్ హోం గ్యాడ్జెట్లే ఇవి..

digital1

స్మార్ట్ పాన్

కిచెన్ వేర్ ఐటెమ్స్ మార్కెట్లో చాలా అందుబాటులో ఉన్నా స్మార్ట్ ఐటెమ్స్ తక్కువే. ముఖ్యంగా స్మార్ట్ పాన్స్ రేర్‌గా కనబడతాయి. ఈ స్మార్ట్ ప్యాన్స్‌తో వంటలు చేయటం ఇంకా సులువు అవుతుంది. ఈ రకమైన పరికరాల్లో ఉన్న ఫీచర్లతో వీటిని స్మార్ట్ ఫోన్‌కు బ్లూటూత్‌తో కనెక్ట్ చేసి ఆక్సెస్ చేయవచ్చు. ఇవి రీచార్జెబుల్ బ్యాటరీలను కలిగి ఉంటాయి. పాన్లో చేస్తున్న వంటకం స్టేటస్‌ను స్మార్ట్ ఫోన్ ద్వారా యూజర్‌కు కమ్యూనికేట్ చేస్తాయి. ఇవి రియల్ టైం మెజర్మెంట్‌ను కలిగి ఉన్నాయి. అటోమేటిక్‌గా టెంపరేచర్ కంట్రోల్ చేసి ఫుడ్ పాడవకుండా హెల్ప్ చేస్తాయి.
digital2

స్మార్ట్ మిర్రర్

ఉన్నట్టుండి ఓ ముఖ్యమైన మీటింగ్‌కు హాజరవాల్సి వచ్చిందనుకుందాం, లేదా పెద్ద పార్టీకి వెళ్లాల్సి వచ్చిందినుకుందాం.. అలాంటి టైం వచ్చినప్పుడు ఎలా రెడీ అవ్వాలో చాలా మందికి తెలియదు. కానీ స్మార్ట్ మిర్రర్ ఇంట్లో ఉందనుకోండి ఎలాంటి టెన్షన్ ఉండదు. Facial Gesture Recog- nition Technology (FGR)తో పని చేసే మిర్రర్లు ఉన్నాయి. ఫేస్‌ను గుర్తించి, బయటి వాతావరణానికి అనుకూలంగా ఉండే మేకప్ టిప్స్ ఇస్తాయి. ఇది సుమారు 70 రకాల ఫేసియల్ యాక్షన్లను గుర్తిస్తుంది. దీంతో పాటు రిమైండర్లను కూడా సేవ్ చేసుకునే వీలుంది. మెడికల్ రిమైండర్లు, డైలీ అపాయింట్మెంట్లను గుర్తుచేస్తుంది. సమయాన్ని వాతావరణ సూచనలను కూడా చూపిస్తుంది. కొన్ని మిర్రర్లకు మధ్యలో కెమెరా కూడా ఉంటుంది. సో మిర్రర్ ముందే నిల్చుని ఫొటోలు కూడా తీసుకోవచ్చు.
digital5

స్మార్ట్ ఫ్రిజ్

ఇప్పుడు వాడుతున్న ఫ్రిడ్జ్ల్‌లో కేవలం అటోమేటిక్ లైట్, టెంపరేచర్ మాత్రమే ఉంటాయి. అలాకాకుండా ఫ్రిడ్జ్ వైఫైతో స్మార్ట్ ఫోన్‌కు కనెక్ట్ చేసుకునే వీలుంటే ఎంత బాగుంటుంది. దాని దగ్గరకు వెళ్లకుండానే అవసరం ఉన్నప్పుడు ఆఫ్ చేయొచ్చు, ఆన్ చేయొచ్చు. ఇష్టమున్నంత టెంపరేచర్ అడ్జస్ట్ చేయొచ్చు. అంతేనా? ఈ స్మార్ట్ ఫ్రిడ్జ్‌లలో ఇంకా చాలా ఫీచర్లు ఉంటాయి. కొన్ని కంపెనీలు అందించే ఇంటర్నెట్ రిఫ్రిజిరేటర్లో మూడు కెమెరాలు ఉంటాయి. నోటిఫికేషన్స్, షెడ్యూల్ కోసం వైట్ బోర్డ్ ఆప్షన్లు ఉన్నాయి. ఫ్యామిలీలో ఎవరికైనా సమాచారం అందించాలంటే ఇక్కడా డిస్‌ప్లే చేసి ఉంచవచ్చు. ఫొటోలను కూడా అప్లోడ్ చేయవచ్చు. ప్రత్యేకంగా ప్రొఫైల్ క్రియేట్ చేసి, చేయాల్సిన పనులను తెలుపుతూ సేవ్ చేసి ఉంచవచ్చు. ట్రాన్స్‌పరెన్స్ టచ్ స్క్రీన్‌తో ఫ్రిడ్జ్‌లో ఏం ఉన్నాయో డోర్ ఓపెన్ చేయకుండానే తెలుసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్‌తో ఐస్ మేకర్‌ను ఆన్‌ఆఫ్ చేయవచ్చు. ఇలాంటి ఫీచర్లు మోడల్‌ను బట్టి, ధరను బట్టి ఉంటాయి.
digital3

డిజిటల్ బార్ టెండర్

సమ్మర్లో ఏదైనా డ్రింక్ తయారు చేసుకోవాలంటే మిక్సీలపైనే ఆధారపడాలి. పడరాని పాట్లు పడి ఓ డ్రింక్ తయారు చేయడానికి ఎంతో శ్రమించాలి. అనుకోకుండా అతిథులు వస్తే హడావిడిగా డ్రింక్స్ కలిపివ్వాల్సి వస్తుంది. అదే డిజిటల్ డ్రింక్ మిక్సర్లు ఉన్నాయనుకో అంత టెన్షన్ అక్కర్లేదు. సోమా బార్ అనే కంపెనీ డిజిటల్ బార్ టెండర్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఆరు రకాల డ్రింక్స్‌ను కలపవచ్చు. ఎలా కావాలి, ఎలాంటి డ్రింక్ కావాలి, లైట్, హార్డ్ మోతాదులో కావాలసిన డ్రింక్‌ను తయారు చేసుకోవచ్చు.
digital4

డిజిటల్ సీసీ టీవి

ఎన్ని స్మార్డ్ గ్యాడ్జెట్లు వాడినా, ఎంత స్మార్ట్ హోం అయినా సెక్యూరిటీ లేకుంటే ఎలా..? అలాంటి హోంలో సెక్యూరిటీ కూడా స్మార్ట్ గానే ఉండాలి. ఇప్పుడు దాదాపు సర్వేలెన్స్ మొత్తం స్మార్ట్ ఫోన్‌కు అటాచ్ అయ్యే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే షాపింగ్ మాల్స్, హోటల్ నిర్వాహకులు తమ బిజినెస్ ఏరియాల్లోని సీసీ టీవీలను తమ ఫోన్‌కు కనెక్ట్ చేసుకుని ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడి నుంచి అయినా చూడగల్గుతున్నారు. కెమెరా పరిధిలో రికార్డు అవుతున్న విజువల్ మొత్తాన్ని ఓనర్ స్మార్ట్ ఫోన్‌కు పంపుతుంది.
digital6

ఇంటెలిజెంట్ మాట్రెసిస్

మనం రోజూ నిద్రపోయే పరుపులు మనకు సలహాలిస్తే, ఎలా నిద్రపోవాలో అవే చెబితే ఎలా ఉంటుంది? పోనీ మనం పడుకున్నాక మన హార్ట్ బీట్ ఎలా ఉంది, బ్రీథింగ్ ఎలా ఉందో అనలైజ్ చేసి మార్నింగ్ కల్లా డిస్‌ప్లే చేస్తే.. ఇది ఊహించడానికే వీలులేకుండా ఉంది కదా? అవును ఇప్పుడు ఇంటెలిజెంట్ పరుపులు అదే పని చేస్తున్నాయి. ఈ రకమైన స్మార్ట్ పరుపులు మూడు రకాల టెక్నాలజీని కలిగి ఉన్నాయి. స్లీపింగ్ ప్యాటర్న్ ట్రాక్ చేయడానికి స్లీప్ ఐక్యూ టెక్నాలజీ, స్లీపింగ్ హాబిట్‌ను ఇంప్రూవ్ చేసుకోవడానికి సలహాలు ఇస్తాయి. మొత్తం శరీరాన్ని సెన్సార్ చేసి రిజల్ట్ ఇవ్వడానికి టచ్ ఫ్రీ, బయోమెట్రిక్ సెన్సార్ సిస్టమ్ కూడా ఇందులో ఉంటుంది.

- వినో..

701
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles