MI నుంచి AI ట్రాన్స్‌లేటర్


Tue,June 18, 2019 10:56 PM

mi
టెక్ మార్కెట్‌లో తనదైన శైలిలో దూసుకుపోతున్న షోవోమీ మరో ప్రొడక్ట్‌ను వినియోగదారుల కోసం విడుదల చేసింది. మొబైల్స్‌తో సహా ఎన్నో యాక్సెసరీస్‌ను అందించి యూజర్లను ఆకట్టుకుంటున్నది. తాజాగా మరో స్మార్ట్ డివైజ్‌ను ప్రవేశపెట్టింది.

ఎంఐ ఎకోసిస్టమ్ బ్రాండ్ MI AI ట్రాన్స్‌లేటర్ డివైజ్‌ను విడుదల చేసింది. ఈ MIT AI Translator లో oxford dictionary, కొలియన్స్ డిక్షనరీ pre-install అయి ఉంటుంది. దాదాపు 34 భాషలు ఈ డివైజ్‌లో ఉంటాయి. ఈ డివైజ్ లో మూడు చైనీస్ డిక్షనరీలను అందిస్తున్నది. ఇంగ్లిష్‌లో సరైన ఉచ్ఛారణ నేర్చుకునేందుకు ఈ డిక్షనరీలు సహాయపడతాయి. ఆన్‌లైన్‌లోనే కాదు ఆఫ్‌లైన్ లోనూ ఈ డిక్షనరీలు పని చేస్తాయి. దీని ద్వారా చైనీస్, ఇంగ్లీష్, జపనీస్, కొరియన్, జర్మన్ భాషల ట్రాన్స్ లేషన్ కూడా అందుబాటులో ఉంది. రియల్ టైం ట్రాన్స్‌లేషన్ కు సపోర్ట్ చేసేలా డిజైన్ చేశారు. ఇందులో ప్రపంచ వ్యాప్తంగా 224 దేశాల్లోని అన్ని రీజియన్స్‌లో మొత్తం 34 భాషలను కవర్ చేశారు. ఇందులో 5సెంటీమీటర్ల మ్యాక్రోతో క్లోజప్ షాట్స్ తీసుకోనే సామర్థ్యం ఉంది.

స్పెషిఫికేషన్లు ఇవే

4 అంగుళాల డిస్ ప్లే, 16:9 ఆస్పెక్ట్ రేషియో, 2.0GHz మల్టీ కోర్ ప్రాసెసర్, 2GB/3GB ర్యామ్, 16GB/ 64GB ఇంటర్నల్ స్టోరేజీ , 5MP రియర్ కెమెరా, డ్యుయల్ మైక్రోఫోన్, లౌడ్ స్పీకర్, 2200mAh బ్యాటరీ, 25 రోజుల వరకు ఛార్జింగ్. ధర 5వేలు.

637
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles