ఉడుకు రక్తానికి ఉత్తేజం


Tue,June 18, 2019 01:37 AM

shoba
శాంతి భద్రతలను కాపాడే పోలీస్ విభాగంలో విధులు అంటే ధైర్య సాహసాలతో కూడుకున్న పని. ఇలాంటి విభాగంలో ఒక్కోసారి కొన్ని సందర్భాలు పురుషులకే సవాల్‌గా మారుతాయి. కానీ ఈ మహిళా ఎస్పీ అలాంటి ఎన్నిటినో లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్నది. యువతకు స్ఫూర్తి నింపుతున్నది.

సమాజం కోసం ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాల్సిన రంగాలలో పోలీస్ విభాగం ఒకటి. అందులో పని చేసే పోలీసులూ అంతే తెగింపుతో ఉండాలి. గుజరాత్‌లోని బారుచ్ జిల్లా ఎస్పీ శోభ భటాడ అంతే తెగింపుతో ఉంది. ధైర్యసాహసాలతో విధులు నిర్వహిస్తున్నది. అంతేకాదు, స్థానిక యువతను చైతన్య పరుస్తున్నది. కాలేజీల్లో సెమినార్లకు హాజరై ధైర్యాన్ని నింపుతున్నది. సామాజిక బాధ్యతను పెంచుతున్నది. 2014లో ఒకసారి ఓ స్వయంప్రకటిత బాబా కొడుకు కేసులో ఇలాంటిదే జరిగింది. ఆ బాబా కొడుకు ఇద్దరు అక్కా చెల్లెలను రేప్ చేసినట్టు ఆరోపణలొచ్చాయి. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఈ కేసును శోభ ధర్యాప్తు చేశారు. అప్పుడు కూడా ఈమెకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. కానీ భయపడలేదు. దర్యాప్తు కొనసాగించింది. నిందితుల ఇండ్లలో సోదాలు చేసి పది వేల కోట్ల విలువ చేసే ఆస్తులను, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. సీజ్ చేసిన ఆస్తులు అవినీతి పరులపాలు కాకుండా కాపాడింది.

ఆ కేసుతో సంబంధం ఉన్న ఆ బాబా కొడుకును సూరత్ కోర్టు దోషిగా తేల్చింది. ఈ దోషి తండ్రి కూడా అత్యాచారాల కేసులో పట్టుబడి జైలుపాలయ్యాడు. ఇలాంటి ఎన్నో కేసులను శోభ ధైర్యంగా దర్యాప్తు చేసి అక్రమార్కులకు, నేరస్తులకు చుక్కలు చూపిస్తున్నది. 2008 బ్యాచ్‌కు చెందిన శోభ అదే బ్యాచ్‌కు చెందిన ప్రదీప్ షేజుల్‌ను వివాహం చేసుకుంది. ఈ దంపతులు ఖాకీ కపుల్‌గా పేరు గడించారు. ఇటీవల శోభ ఓ కాలేజీలో విద్యార్థులు నిర్వహించిన సెమినార్‌లో పాల్గొని ఉపన్యాసం ఇచ్చింది. స్ఫూర్తివంతమైన ఈ స్పీచ్ ఇటీవలే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

4287
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles