పులిపిర్లు పోగొట్టుకోండిలా!


Tue,June 18, 2019 01:37 AM

pulipiri
అందమైన ముఖారవిందం. కానీ ఆ అందాన్ని తగ్గించేవి పులిపిర్లు. కొందరికి ముఖం మీద, ఇంకొందరికి మెడ మీద, మరికొందరికి ముక్కు మీద ఇలా ఎక్కడ పడితే అక్కడ ఏర్పడతాయి. వైరల్ ఇన్‌ఫెక్షన్‌తో వచ్చే పులిపిర్లతో అందవిహీనంగా కనిపిస్తారు. ఈ చిన్న చిట్కాలు పాటించి పులిపిర్లు పోగొట్టుకోవచ్చు.

- దూదిని యాపిల్ సిడర్ వెనిగర్‌లో ముంచి పులిపిర్లు ఉన్న చోట అద్దాలి. వారంలో ఐదురోజులు ఇలాచేస్తే పులిపిర్లు పూర్తిగా తగ్గిపోతాయి. యాపిల్ సిడర్ వెనిగర్‌లో అధిక యాసిడ్ కంటెంట్ ఉంటుంది. ఇది వాడడం వల్ల పులిపిర్లు మరింత పెరగకుండా సహజ సిద్ధంగా తగ్గిపోతాయి.
- కలబంద ఆకు మధ్యలో ఉండే జిగురును తీసుకుని పులిపిర్లపై రాస్తే చాలు పులిపిర్లు కొద్ది రోజుల్లోనే మాయమవుతాయి. కలబందలో ఉండే మేలిక్ యాసిడ్ పులిపిర్లలోని ఇన్‌ఫెక్షన్‌తో పోరాడుతుంది. క్రమం తప్పకుండా వారం రోజులు ఈ చిట్కా పాటిస్తే ఫలితం ఉంటుంది.
- ఆముదంలో కాస్త బేకింగ్ పౌడర్ వేసి బాగా కలపాలి. దాన్ని పులిపిర్లపై రాసి బ్యాండేజ్ వేయాలి. అలా రాత్రంతా ఉంచుకుని ఉదయాన్నే కడిగేయాలి. ఇలా రెండు మూడు రోజులు చేస్తే పులిపిర్లు పూర్తిగా తొలిగిపోతాయి.
- అరటిపండు తొక్కలో ఉండే ఎంజైములు చర్మానికి మేలు చేస్తాయి. అరటి పండు తొక్కతో రోజూ పులిపిర్లపై రుద్దితే అది క్రమేపీ కనుమరుగు అవుతుంది. వెల్లుల్లి ముద్దగా చేసుకుని పులిపిర్లు ఉన్న చోట రాస్తే ఫలితం ఉంటుంది. వెల్లుల్లిలో ఉండే ఎల్లిసిన్.. ఫంగస్ వైరస్ వంటి బ్యాక్టీరియాలతో పోరాడుతుంది.
- పులిపిర్లు ఉన్నవారు వాటిని పదే పదే తాకకూడదు. పులిపిర్లను తాకిన వెంటనే చేతులు శుభ్రంగా కడుక్కుంటే మంచిది. ముఖ్యంగా పులిపిర్లు తాకి చిన్నారులను తాకితే వారికి కూడా పులిపిర్లు వచ్చే అవకాశం ఉంటుంది.

8804
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles