మానవత్వం చాటుకున్నది


Tue,June 18, 2019 01:37 AM

mother-teresa
ఎండలు పోయి చల్లబడనేలేదు. చికాగో మాత్రం ప్రజలు చలికి గజగజ వణికిపోతున్నారు. ఆ భయంకరమైన చలి నుంచి ప్రజలను తప్పించడానికి ఓ మహిళ శాయశక్తులా ప్రయత్నిస్తుంది. వారిపట్ల ప్రేమను చూపుతూ మానవత్వానికి మారుపేరుగా నిలిచింది.
mother-teresa1
చికాగోలో ఇటీవల కురిసిన మంచుకు నగరం అస్తవ్యస్థమయింది. ఉష్ణోగ్రతలు మైనస్ 27 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయంటే అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 36 యేండ్ల కాండిస్ పెయిన్ రియల్ ఎస్టేట్ ఆఫీస్‌లో సాధారణ ఉద్యోగిణి. ఆమె ఆఫీసుకు వెళ్లే దారిలో చిన్న చిన్న గుడారాలు వేసుకొని కొందరు జీవనం సాగిస్తుంటారు. ఆ ప్రదేశానికి టెంట్ సిటీ అని పేరు. పెద్ద భవనాల్లో ఉండే వారు మంచు దెబ్బకు అల్లాడిపోతుంటే గుడారాల్లోని ప్రజలు ఎలా తట్టుకుంటున్నారనుకుంది కాండిస్. అంతమందికి ఆశ్రయం కల్పిద్దామంటే ఆమె ఇల్లు చాలదు. అందుకే తన దగ్గరున్న సొమ్ముతో వారికి హోటల్ రూమ్‌లు బుక్ చేయాలనుకున్నది. ఏ హోటల్ యాజమాన్యం వారికి గదులు ఇవ్వడానికి అంగీకరించలేదు. ఒక్క హోటల్ తప్ప. ఒక్కరోజుకు 70 డాలర్ల చొప్పున 20 గదులను బుక్ చేసింది. ఆమె చేసిన పనిని ఎవరైనా మనసున్న వారు ఆ ప్రజలను హోటళ్ల వరకు దిగబెట్టాలని అభ్యర్థించింది. ఆమెకు తోడుగా నగరవాసులు కొందరు వెంటనే స్సందించి సాయం చేసేందుకు ముందుకొచ్చారు. టెంట్ సిటీలో 80 మందినే కాకుండా మరో 40 మందికీ హోటల్లో ఆశ్రయం కల్పించింది.ఈ పేద ప్రజలకు దాతలు ముందుకొచ్చి ఆహారం, దుస్తులు అందించారు. కాండిస్‌ను మన మదర్ థెరిస్సాఅంటూ అందరూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

2480
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles