లిచీ పండ్లు ప్రమాదకరమా?


Tue,June 18, 2019 01:37 AM

lichi-fruite
ఈ మద్య లిచీ పండ్లు తిని బీహార్‌లో 53 మంది చిన్నారులు చనిపోయారని సామాజిక మాధ్యమాల్లో ఓ సందేశం వైరల్ అవుతున్నది. స్ట్రాబెర్రీ రూపంలో ఉండే లిచీ పండ్లు తింటే చనిపోతారా? ఎప్పుడు తినాలి. అనే విషయం తెలుసుకుందాం.

- లిచీ పండ్లను పరిగడుపున తినకూడదు. పచ్చిగా ఉండే లిచీ పండ్లు మరింత హానికరం. రాత్రులు నిద్రపోయే ముందు, ఉదయం పూట ఈ పండ్లను అస్సలు తినకూడదు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ పండ్లకు దూరంగా ఉండడమే మంచిది.
- లిచీ పండ్లలో ఉండే విషతుల్య పదార్థం మెదడు వాపు వ్యాధికి దారి తీస్తుంది. లిచీ పండ్లు పరిగడుపున తినడం వల్ల ఇందులో ఉండే మిథెలిన్ సైక్లోప్రొపిల్- ైగ్లెసిన్ (MCPG) రసాయనంతో రక్తంలో చక్కెర శాతం ప్రమాదకర స్థాయికి తగ్గుతుంది. దీనివల్ల అనారోగ్యం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
- లిచి పండ్ల గింజలు విషతుల్యం. ఇవి తినడం వల్ల శరీరంలో హైపోైగ్లెసెమిక్ ఏర్పడి షుగర్ స్థాయిలు పడిపోతాయి. పండినవైనా, పచ్చివైనా ఇవి ఆరోగ్యానికి హానికరమే.
- ఈ పండ్లలో బ్యాక్టీరియా పేరుకుపోయి ఉంటుంది. ఒకవేళ తినాలనుకుంటే మధ్యాహ్నం పూట మాత్రమే తినాలి. అవి కూడా గోరు వెచ్చని నీటిలో కడిగి మాత్రమే తినాలని వైద్యులు చెబుతున్నారు.
- ముఖ్యంగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో ఇవి తినొద్దు. తేమ 65 నుంచి 80 శాతం వరకు ఉన్న సమయంలో ఈ పండ్లు తింటే మెదడువాపు వ్యాధి వచ్చే అవకాశం ఉంది.

4573
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles