అవాంఛిత రోమాలా?


Mon,June 17, 2019 12:13 AM

చాలా మంది మహిళలకు, విద్యార్థిణులకు పై పెదవిపైన అవాంఛిత రోమాలు ఉంటాయి. ఎంత అందంగా ఉన్నప్పటికీ వీటి వల్ల అందవిహీనంగా కనిపిస్తారు. అలాంటి వారు ఈ చిన్న చిట్కాలు పాటిస్తే చాలు అవాంఛిత రోమాల సమస్య నుంచి బయటపడవచ్చు.
wanted-hair
-ఒక గిన్నెలో 3 టేబుల్ స్పూన్ల పంచదారను తీసుకోవాలి. దానికి 1 టేబుల్ స్పూన్ తేనె, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి. పై పెదవి ప్రాంతంలో ఈ మిశ్రమాన్ని ఒక పొరగా వేయాలి. 15-20 నిమిషాలు ఆరనివ్వాలి. మొఖం మీది పొరను తీసేసి గోరువెచ్చని నీటితో ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
-అర టీ స్పూను పసుపు పొడి, 2 టీ స్పూన్ల పచ్చి పాలు ఒక గిన్నెలో తీసుకుని బాగా కలపాలి. పై పెదవి ప్రాంతంలో ఈ మిశ్రమం పొరను ఐప్లె చేయాలి. ఆరిపోయాక పొరను తొలగించి గోరు వెచ్చని నీటిని ఉపయోగించి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయాలి. వారానికి ఒకసారి చేస్తే ఫలితం ఉంటుంది.
-అరటీ స్పూన్ శనగపిండి, 2 టీస్పూన్ల తేనెను ఒక గిన్నెలోకి తీసుకుని బాగా కలపాలి. 15- 20 నిమిషాలు ఆరనివ్వాలి. జుట్టు పెరుగుదలకు వ్యతిరేక దిశలో వేసిన పొరను, నెమ్మదిగా తొలగించి, గోరువెచ్చని నీటితో శుభ్రపర్చాలి. పొడి తువాలుతో ఆ ప్రాంతం నుంచి తడిని తొలగించాలి. వారానికి రెండు సార్లు ఇలా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
-గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ జెలటిన్ తీసుకోవాలి. పాలు చేర్చి బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని మైక్రోవేవ్‌లో అర నిమిషం ఉంచాలి. బౌల్‌ను బయటకు తీసి మిశ్రమాన్ని కలిపి, నాలుగు చుక్కల నిమ్మరసం కలుపాలి. అవాంఛిత రోమాల వద్ద పుల్లతో ఐప్లెచేయాలి. 10 నిమిషాల తర్వాత పొరను తొలగించి చల్లటి నీటితో కడగాలి. నెలకోసారి ఇలా చేస్తే ఫలితం ఉంటుంది.

1680
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles