చిన్న వయసులోనే పెద్ద పని !


Mon,June 17, 2019 12:13 AM

12 యేండ్ల వయసు.. చదివేది ఎనిమిదో తరగతి. అనర్గళంగా మాట్లాడగలుగుతుంది. అంతకు మించి చెప్పాలంటే శిలాజాల మ్యూజియానికి యజమాని. ఆమె ఓ చిన్నారి పరిశోధకురాలు. ఆమె ఎవరంటే..
ashwatha-biju
చెన్నైకి చెందిన అశ్వతా బిజుకు 12 యేండ్లు. స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నది. 74 శిలాజాలతో కూడిన ఓ చిన్న మ్యూజియాన్ని ఏర్పాటు చేసింది. అశ్వతా బిజుకు ఐదేండ్ల వయసున్నప్పుడు తల్లిదండ్రులతో కలిసి ఓ మ్యూజియాన్ని సందర్శించింది. అందరు పిల్లల్లా మ్యూజియంలోని ప్రాచీన విశేషాలను చూసి వెంటనే మరిచిపోలేదు అశ్వత. ఇంటికొచ్చి పదే పదే తల్లిదండ్రులను వాటి గురించి అడిగింది. దాంతో గూగుల్‌లో సముద్ర జీవులు, శిలాజాల వీడియోలు, చిత్రాలు చూపించారు. అలా కలిగిన ఆసక్తి ఆమెను పరిశోధనలు చేసే దాకా తీసుకెళ్లింది. ఆ తర్వాత అశ్వత తమిళనాడులోని పెరంబలూర్, అరియార్ జిల్లాలకు అధ్యయనం కోసం వెళ్లింది. అక్కడ అమోనైట్స్, ఎచినోయిడ్స్, బివాల్వ్స్, లోఫా, బెలెంనైట్, గ్యాస్ట్రోపాడ్స్, నాటీలస్ వంటి అరుదైన శిలాజాలను సేకరించింది. వాటిని మ్యూజియం మాదిరిగా ఏర్పాటు చేసి స్థానిక పాఠశాలల విద్యార్థులకు వివరిస్తున్నది. అన్నా విశ్వ విద్యాలయానికి చెందిన డాక్టర్ ఆర్. నాగేంద్ర, పెరియార్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ రామ్‌కుమార్, యూఏఈకి చెందిన మరో భౌగోళిక నిపుణుడు అశ్వతకు మార్గనిర్ధేశనం చేస్తున్నారు. వాళ్ల వద్ద నేర్చుకున్న విద్యతో అనేక వేదికలపైన శిలాజాలు, సముద్ర జంతువులపై అనర్గలంగా ఉపన్యాసాలిస్తున్నది. స్థానికంగా ఉన్న ఇతర ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు సైతం ప్రత్యేక తరగతులు చెప్పించుకునేందుకు అశ్వతను ఆహ్వానిస్తున్నాయి. భవిష్యత్‌లో గొప్ప పాలియంథాలజిస్టును కావాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు అశ్వతా బిజు చెబుతున్నది.

1445
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles