కీటకాలను తరిమికొట్టండి


Thu,June 13, 2019 12:02 AM

mouse
-ఒక గిన్నెలో వేడి నీరు తీసుకుని, అందులో మూడు నుంచి నాలుగు టీ బ్యాగులను వేసి మరిగించాలి. ఈ వాసనకు సాలీడులు, ఎలుకలు దూరంగా పారిపోతాయి. ఎంత ఘాటైన వాసన కలిగిన టీ బ్యాగుల్ని వేస్తే అంత మంచిది. అస్సాం టీ నీలగిరి తేయాకు, పిప్పరమెంట్ టీ ఈ పనికి బాగా ఉపయోగపడుతాయి.
-భారతీయ మసాలా వంటకాల్లో విరివిగా వాడే బిర్యానీ ఆకులు వాసన, రుచిలో ఘాటుగా ఉంటాయి. బిర్యానీ ఆకులను చిన్న చిన్న ముక్కలుగా చేసి వంటింట్లో కీటకాలు తిరిగే చోట పెడితే చాలు ఈ ఆకుల ఘాటుకు కీటకాలు బయటకు పరుగులు పెడతాయి.
-ఎలుకలు ఇంట్లోకి ప్రవేశిస్తున్న మార్గాన్ని గుర్తించి మింట్ టూత్ పేస్టు కొద్దిగా పూస్తే చాలు ఎలుకలు లోపలికి రావు. బీరువాలు, ఆల్మారాల దిగువన కొంచెం టూత్ పేస్టు రుద్దితే ఎలుకలు అందులోకి వెళ్లడానికి సాహసించవు.
-ఎలుకలు, సాలెపురుగులను వదిలించుకోవడానికి వాడే సురక్షితమైన మార్గాలలో వంట సోడా ఒకటి. ఎలుకలు, క్రిమి కీటకాలు ఉండే చోట వంట సోడా చల్లితే ఆ వాసనకు కీటకాలు దూరంగా పారిపోతాయి.
-మస్కిటో కాయిల్స్, మస్కిటో రిఫిల్స్ వాడితే కొన్నాళ్లకు ఆస్తమా, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉన్నది. ముఖ్యంగా పిల్లలకు వీటి ద్వారా ఎఫెక్ట్ పడుతుంది. వేప ఆకులను మండించి గది అంతా పొగతో చూపాలి. ఆ తర్వాత డోర్లు తెరవాలి. ఇలా చేస్తే మూలల్లో దాగున్న దోమలు పరారవుతాయి.

1283
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles