ఆమె ఒక హీరో!


Thu,June 13, 2019 12:01 AM

సామాన్య మానవుడి హక్కు అంటూ వచ్చిన ఆధార్ అన్ని రంగాల్లో కీలకమైంది. ఈ నేపథ్యంలో ఆధార్‌లోని లోపాలను ఎత్తి చూపుతూ దశాబ్దం పాటు ఉద్యమించిందో సామాజిక కార్యకర్త. చివరకు ఆధార్‌లోని కొన్ని లోపాలను సవరించేందుకు ఆమె కారణమయ్యారు. అందుకే ఆమెకు ఓ సంస్థ హ్యూమన్ రైట్స్ హీరో అవార్డును అందజేసి సత్కరించేందుకు సిద్ధమైంది.
usha-ramanathan
లీగల్ రీసెర్చ్, సామాజిక కార్యకర్త ఉషా రామనాథన్ 2009 నుంచి ఆధార్‌కు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. అందుకే ఇంటర్నేషనల్ రైట్స్ గ్రూప్ యాక్సెస్ నౌ సంస్థ ఆమెను హ్యూమన్ రైట్స్ హీరో బిరుదుతో సత్కరించనుంది. ఈ నెల 11 నుంచి 14 వరకు ట్యూనీషియాలో జరిగే మానవ హక్కుల సమావేశం, సాంకేతికత సమావేశంలో ఐక్యరాజ్య సమితి హై కమిషనర్ ఫర్ హ్యూమన్ రైట్స్ మైఖేల్ బచెలెట్ చేతుల మీదుగా ఉషా రామనాథన్‌కు ఈ అవార్డును అందజేయనున్నారు. 2009లో ఆధార్ ప్రవేశపెట్టినప్పుడు నాణ్యత, గోప్యత తదితర విషయాల్లో ఆధార్ సరైంది కాదని విమర్శించిన వారిలో ఉషా రామనాథన్ ఒకరు. అప్పటి నుంచి ఆధార్‌కు వ్యతిరేకంగా ఉద్యమిస్తూనే ఉన్నారు. అందులోని లోపాలను ఎత్తి చూపుతూనే ఉన్నారు. 2018 సెప్టెంబర్‌లో సుప్రీం కోర్టు ఆధార్ అన్నింటికీ తప్పనిసరి అని తీర్పునిచ్చింది. ఈ క్రమంలో ప్రైవేటు కంపెనీలకు ఆధార్ అవసరం లేదని ఉషా రామనాథన్ ఆధార్ లొసుగులను ఎత్తిచూపారు. అనంతరం సుప్రీం కోర్టు తీర్పులకు అనుగుణంగా కొన్ని సవరణలతో ఈ బిల్లును రెండు వారాల క్రితం క్యాబినెట్ ఆమోదించింది. సమాచార సాంకేతిక శాఖామంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ అవార్డు తన ఆధార్ కోసం ఉద్యమించిన ప్రతి ఒక్కరికీ అంకితం అని ఉషారామనాథన్ అన్నారు.

968
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles