సేంద్రియ పద్ధతిలో కూరగాయలు


Wed,June 12, 2019 01:19 AM

ప్రతిరోజూ తీసుకునే కూరగాయలను పురుగు మందులతోనే ఎక్కువగా పండిస్తున్నారు. దీనివల్ల ఆ కూరగాయలు విషతుల్యంగా మారి అనేక రోగాలకు కారణమవుతున్నాయి. అటువంటి సమస్యను పరిష్కరించేందుకు సేంద్రియ పద్ధతిలో కూరగాయలను పండిస్తూ భవిష్యత్ తరాలకు ఆరోగ్య సందేశమిస్తున్నదీ 62 యేండ్ల బామ్మ.
woman-organic
బయట కూరగాయలు కొనాలంటే జనాలు భయపడాల్సి వస్తున్నది. ఆ కూరగాయలు ఎన్నిరకాల క్రిమి సంహారక మందులు వేసి పండించారోనని ఆందోళన చెందాల్సిన పరిస్థితులున్నాయి. అందుకే అహ్మదాబాద్‌కు చెందిన 62 యేండ్ల భావన షా తన ఇంటి ఆవరణలోనే సేంద్రియ పద్ధతిలో కూరగాయలను పండిస్తున్నది. భావనాషా భర్త నితిన్‌తో కలిసి ఉద్యోగరీత్యా ముంబైలో కొన్నాళ్ల పాటు ఉండాల్సి వచ్చింది. అక్కడ కాలుష్య వాతావరణంలో ఉండలేక ఆమె భర్త రిటైర్ అయిన తర్వాత అహ్మదాబాద్‌కు వచ్చేశారు. కాలుష్యానికి దూరంగా ఉండాలనుకున్నారు. అందుకోసం తమ పెరట్లో ఆకు కూరలు, పలురకాల కాయలు పండించడం ప్రారంభించారు. వర్షం నుంచి వచ్చిన నీటిని ఒడిసి పట్టేందుకు ఇంకుడు గుంతలు తవ్వించారు. తద్వారా వర్షపు నీటిని నిల్వ ఉంచి సేంద్రియ సాగు మొదలు పెట్టారు. ఇంటిపై 10,000 లీటర్ల సామర్థ్యం కలిగిన ఓ ట్యాంక్‌తోపాటు, విద్యుత్ కోసం 12 సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేశారు. 2,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 20 రకాల కూరగాయలు, పండ్లను పండిస్తున్నారు. తమకు కావల్సినప్పుడల్లా తాజా కూరగాయలను కోసుకొని తింటూ ఎంతో ఆరోగ్యంగా ఉంటున్నామని చెబుతున్నది భావన షా. తోటకు కావాల్సిన సేంద్రియ ఎరువులను వారే తయారు చేసుకుంటూ, హానికరమైన వాతావరణానికి దూర ంగా ఉంటున్నారు.

804
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles