చద్దన్నం మూట విప్పండి!


Wed,June 12, 2019 01:18 AM

పెద్దల మాట చద్దన్నం మూట సామెత బాగా పాపులర్ అయ్యింది. అదే మాదిరిగా ఒకప్పుడు సద్దన్నం కూడా బాగా ఫేమస్సు. ఇప్పుడైతే సిటీల్లో అన్నం మిగిలితే చెత్తలో పడేస్తున్నారు. పల్లెల్లో ఫ్రైడ్ రైస్ చేసుకుని తింటున్నారు. సద్దన్నంతో ఎన్ని లాభాలున్నాయో చదవండి.
daddojanam
-టిఫిన్ అనగానే మనకు గుర్తొచ్చేవి ఇడ్లీ, దోశ, చపాతి, కానీ రాత్రి వండిన అన్నాన్ని తెల్లవారి ఆవకాయ, పెరుగు కలుపుకుని పచ్చిమిరప, ఉల్లిగడ్డ నంజుకుని తింటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.
-చద్ది అన్నంలో పొటాషియం, కాల్షియం, ఐరన్, విటమిన్లు దాదాపుగా 15 రెట్లు అధికంగా ఉంటాయి. ఉల్లిపాయ, మిరపకాయ పెరుగు కలుపుకుని తింటే శరీరంలో వేడి తగ్గి చలువ చేస్తుంది. ఎండాకాలంలో శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది.
-రాత్రిపూట మిగిలిన అన్నంలో కొంచం పాలు, పచ్చి ఉల్లిపాయ ముక్కలు, అల్లం, కరివేపాకు, జీలకర్ర వేసి కలిపి దానిలో కొంచెం పెరుగు వేసి పొద్దున తింటే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఎముకలకు బలం కూడా చేకూరుతుంది.
-చద్దన్నం తింటే మంచిదే కదా అని మధ్యాహ్నమో సాయంత్రమో తిందామంటే కుదరదు. తెల్లారిన తర్వాత కూడా ఎక్కువ సమయం అలాగే ఉంచేస్తే పాడైపోయే అవకాశం ఉంది. అందుకే చద్ది అన్నాన్ని ఉదయం 9 గంటల్లోపే తినేయాలి.
-ముందురోజు వండిన అన్నం ఉదయం తీసుకోవడం వల్ల అరుదుగా లభించే విటమిన్ బి6, బి 12ను తేలికగా పొందవచ్చు. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. చద్ది అన్నాన్ని వారంలో కనీసం రెండుసార్లు తినే వారిలో రోగనిరోధక శక్తి శాతం ఎక్కువగా ఉంటుంది.

2033
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles