పాదాలపై పగుళ్లా?


Wed,June 12, 2019 01:16 AM

ఆముదం, రోజ్‌వాటర్, నిమ్మరసంను సమపాళ్లలో కలిపి, పాదాలు పగిలిన చోట ప్రతి రోజు 2 సార్లు లేదా 3 సార్లు పూస్తే పాదాల పగుళ్లు మాయమవుతాయి. వారం పాటు క్రమం తప్పకుండా చేస్తే మంచిది.
paadalu
-మైనంను కొద్దిగా వేడిచేసి కరిగిన తర్వాత దాని బరువులో సగభాగం ఆవాల నూనెను కలపాలి. ఒక పాత్రలో కొన్ని నీళ్లు పోసి అందులో నూనెను కలిపిన మైనాన్ని వేయాలి. కొద్దిసేపటి తర్వాత ఆ నీళ్లను గిన్నెలో వడబోయాలి. వడకట్టిన తర్వాత గిన్నెలో పడే పదార్థాన్ని రాత్రి పడుకునే ముందర కాళ్ల పగుళ్లకు పూయాలి. వారం పాటు ఇలా చేస్తే సమస్య తొలిగిపోతుంది.
-రాత్రి పడుకునే ముందు వేడి చేసిన కొబ్బరి నూనెను పాదాల పగుళ్లకు పూసి సాక్సులు వేయాలి. ఉదయం సాక్స్‌లు తీసి వేడి నీళ్లలో పాదాలను 15 నిమిషాలు ఉంచాలి. పగుళ్ల వద్ద నిదానంగా బ్రష్‌తో శుభ్రం చేయాలి.
-25 గ్రాముల మైనం, 100 గ్రాముల ఆవాల నూనెను వేసి, ఒక పొంగు వచ్చే వరకు మరిగించాలి. నూనె చల్లారక ముందే ఒక వెడల్పాటి మూతి కలిగిన పాత్రలో నిల్వ చేసుకోవాలి. చల్లారిన తర్వాత ఆయింట్‌మెంట్ మాదిరిగా తయారవుతుంది. దీన్ని పగుళ్ల వద్ద పూస్తే అవి తొలిగిపోతాయి.
-పాదాలు బాగా పగిలితే రాత్రి సబ్బుతో కడిగి పొడి బట్టతో తుడవాలి. తర్వాత నువ్వుల నూనె రాయాలి. సాక్సులు ధరించి నిద్రపోవాలి. ఉదయం మళ్లీ సబ్బుతో కడిగితే సరిపోతుంది.

2084
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles