త్రీడీ హోలోగ్రామ్స్ సర్కస్


Wed,June 12, 2019 01:15 AM

సర్కస్‌లో వివిధ జంతువుల విన్యాసాలు చిన్నా, పెద్ద అనే తేడాల్లేకుండా అందరినీ ఎంతో అబ్బుర పరుస్తుంటాయి. ఇలా మూగ జీవులను హింసించడం నేరమని పలు జంతు సంరక్షణ సంస్థలు కోరడంతో జర్మనీ దేశంలో సర్కస్‌లో వాటి వేధింపులకు తెరపడింది. టెక్నాలజీని ఉపయోగించి జంతువుల స్థానంలో త్రీడీ హోలోగ్రామ్స్‌ను ప్రవేశపెట్టగా ఇదిప్పుడు ట్రెండింగ్ అవుతున్నది.
German-Circus
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పలురకాల సాధు జంతువులతోపాటు, క్రూర జంతువులను త్రీడీ హోలోగ్రామ్ రూపంలో రూపొందించి సర్కస్ విన్యాసాలను ప్రదర్శిస్తున్నారు. జంతువులను హింసించకుండా ఉండేందుకు జర్మనీలోని ఓ సర్కస్ కంపెనీ ఈ వినూత్న పద్ధతిని అనుసరిస్తున్నది. త్రీడీ హోలోగ్రామ్స్ రూపంలో జంతువులు జనాల మీదకు దూసుకెళ్లినా ఎటువంటి ప్రమాదం వాటిల్లదని సర్కస్ నిర్వాహకులు చెబుతున్నారు. పేరుకే టెక్నాలజీ కానీ, అచ్చం నిజమైన జంతువులు కండ్ల ముందు కదలాడినట్లు అనిపిస్తుందని వారు అంటున్నారు.

సర్కస్ రాన్కాల్లి అనే సంస్థ జంతువుల రూపంలో 3డీ హోలోగ్రామ్స్‌ను రూపొందించింది. తొలిసారిగా వీటిని జర్మనీలో ప్రవేశపెట్టారు. ఏనుగులు, గుర్రాలు, ఇతర జంతువుల హోలోగ్రామ్స్ పలు రకాల విన్యాసాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. సర్కస్‌లో భాగంగా డమ్మీ జంతువులు చేసే హూంకార, గీంకారాలతో శబ్దాలు అద్భుతంగా ఉన్నాయని, నిజం జంతువులే చేసినట్లుగా అనిపిస్తుందని ప్రేక్షకులు చెబుతున్నారు. మరికొద్ది రోజుల్లో అన్ని దేశాలకూ రానున్న ఈ త్రీడీ హోలోగ్రామ్ జంతువులను గురించి సోషల్‌మీడియాలో చర్చ జరుగుతున్నది.

275
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles