నవజాత శిశువుల ఆలనా పాలనా!


Wed,June 12, 2019 01:15 AM

child
-బాబు పుట్టిన నెల రోజుల్లోనే సున్నితంగా ఎక్కువ ఒత్తిడి లేకుండా మర్దన చేయాలి. క్రమంగా ఒత్తిడితో మర్దన చేయాలి. మర్దనా చేసేముందు మీరు విశ్రాంతిగా ఉండాలి. మర్దన చేసేముందు మీ చేతులని 2-3 సార్లు రుద్దుకుంటే చేతులు వేడెక్కుతాయి.
-మీ చేతికి గోళ్లు లేకుండా చూసుకోవడం మంచిది. గుళ్లు పెరిగి ఉంటే శిశువుకు గుచ్చుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వేడి నీళ్లతో ముందు వీపు మీద, ఆ తర్వాత తల మీద పోసి స్నానం చేయించి తెల్లని తువ్వాలుతో తుడవాలి.
-స్నానం అనంతరం పాలు పట్టించి పడుకోబెట్టాలి. స్నానం శిశువులకు మంచి నిద్ర, సుఖాన్ని ఇస్తుంది. శిశువు స్నానం ఆయాలకి, అనర్హులకు అప్పజెప్పడం కంటే మీరే చేయిస్తే మీ చేతి స్పర్శతో మరింత అనుబంధం పెరుగుతుంది.
-శిశువులకు ఆరు నెలల వరకు నీటితో అవసరం ఉండదు. సమయమేదైనా శిశువులు ఏడిస్తే పాలు పట్టిస్తే చాలు. కొన్ని సందర్భాల్లో డాక్టర్ సూచనల మేరకు మాత్రమే పాల ఉత్పత్తులు గానీ, ఇతర ద్రవాలను గానీ పట్టించాలి. చిన్నారుల విషయంలో స్వంత నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది.

528
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles