అలియా ఫ్యాషన్ ప్రచారం


Wed,June 12, 2019 01:14 AM

అలియా భట్ సినిమాల్లోనే కాదు.. సామాజిక కోణంలోనూ క్రియా శీలంగా పాల్గొంటున్నది. గతంలో పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్న అలియా తాజాగా పర్యావరణం కోసం ప్రచారం చేస్తున్నది.
Alia-bhatt-fashion
మైసు ఫ్యాషన్ గురించి తెలుసా? దుస్తులను రీసైకిల్ చేసి ఎలా వినియోగించుకోవచ్చు అనేది దీని ప్రధాన ఉద్దేశం. మైసు ఫ్యాషన్‌గా పిలిచే దీని పూర్తిపేరు మై వార్డ్‌రోబ్.. సు వార్డ్‌రోబ్. దీనిని ఒక క్యాంపెయిన్‌లా నిర్వహిస్తుండగా అలియా భట్ దానిని ప్రమోట్ చేస్తున్నది. పాతబట్టలను పారేయ కూడదు. వాటిని అందంగా డిజైన్ చేసి కొత్తవాటిగా మార్చాలి. వార్డ్‌రోబ్‌లు పాత బట్టలతో కాకుండా రీసైకిల్.. రీడిజైన్ చేసిన ఇలాంటి దుస్తులతో కనిపించాలి అని అలియా అవగాహన కల్పిస్తున్నది. సాల్ట్ స్కౌట్ డాట్ కమ్ ద్వారా ఇలా కొత్తగా డిజైన్ చేసిన దుస్తువులను అమ్ముతున్నారు. వాటిని ది కోర్బెట్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాల కోసం వినియోగిస్తున్నారు.

అనుష్క శర్మ కూడా ఈ క్యాంపెయిన్‌లో పాల్గొంటున్నది. అనుష్క నుంచి ఛాలెంజింగ్‌గా ఈ క్యాంపెయిన్‌ను తీసుకొని అలియా సమాజం పట్ల తనకున్న బాధ్యతను.. తనలోని సేవా గుణాన్ని చాటుతున్నది అని సోషల్‌మీడియాలో ప్రశంసలు గుప్పిస్తున్నారు కొందరు. అయితే ఫ్యాషన్‌ను సేవ కోసం వినియోగించడం చాలా బాగుందనీ.. మనకు అవసరం రానిది ఇతరులకు అవసరం వస్తుందనే బాధ్యతతో ఏది చేసినా ఫలితం మంచిగానే ఉంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

210
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles