పచ్చదనాన్ని కాపాడేందుకు..


Wed,June 12, 2019 01:14 AM

ప్రకృతి మనకు అందమైన వాతావరణాన్ని ఇచ్చింది. దానిని కాపాడుకోవడంలో ఎక్కువగా మానవ తప్పిదాలే కనిపిస్తున్నాయి. పలురకాలుగా మన చుట్టూ ఉన్న మంచి వాతావరణాన్ని చేతులారా నాశనం చేసుకుంటున్నాం. పరిశుభ్రత, పచ్చదనం సరిగా లేకపోవడం వల్ల మనుషులేకాదు పెంపుడు జంతువులూ తొందరగా తనువు చాలిస్తున్నాయి. వాటి జ్ఞాపకార్థం బెంగళూరుకు చెందిన ఓ లా విద్యార్థి వినూత్నంగా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు.
b-luru-law-student
బెంగళూరుకు చెందిన ప్రమోద్ అనే యువకుడు సిలికాన్ వ్యాలీలో లా చదువుతున్నాడు. బెంగళూరు నగరంలో అంతరించి పోతున్న పచ్చదనాన్ని పెంచేందుకు వినూత్న ఆలోచన చేశాడు. పెంపుడు జంతువులను పోషించే యజమానుల కోసం ప్రత్యేకంగా ఓ ప్రాజెక్టును రూపొందించాడు. ఏదోక జబ్బుతో ప్రతి ఏటా పెంపుడు జంతువులు చనిపోతుంటాయి. వాటిని ఎక్కడ పడితే అక్కడ భూమిలో పూడ్చేస్తూ ఉంటారు. దాని వల్ల పర్యావరణం దెబ్బతింటుంది. అలా దెబ్బతినకుండా ఉండేందుకు ఆయా జంతువులను భూమిలో పూడ్చకుండా కాల్చడం వల్ల కొంతమేర ప్రకృతిని కాపాడిన వారమవుతామని వారికి అర్థమయ్యేలా వివరించాడు. ఇటలీలో చనిపోయిన పెంపుడు జంతువులను కాల్చి, తద్వారా వచ్చిన బూడిదను మొక్కలకు ఎరువుగా వేస్తున్నారు. అదే ప్రాజెక్టును బెంగళూరులోనూ ప్రారంభించాడు. ఈ ప్రాజెక్టు కింద బెంగళూరు నగరంలో చనిపోయిన పెంపుడు జంతువును కాల్చివేసి, ఆ బూడిదను వాటి జ్ఞాపకార్థకంగా ఓ మొక్కను నాటించి ఎరువుగా వేస్తున్నాడు.

146
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles