రూప.. ఫుడ్ డెలివరీ గర్ల్


Wed,June 12, 2019 01:13 AM

జీవితం సజావుగా సాగుతున్నదని అనుకున్నప్పుడే ఏదో ఒకటి జరుగుతుంది. అలాంటప్పుడే ధైర్యంగా ముందుకు వెళ్లాలి. కోల్‌కతాకు చెందిన రూప చౌదరి ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నది. అండగా ఎవరూ లేకపోయినా తనను తాను నమ్ముకొని జీవనోపాధి పొందుతున్నది.
rupa
కష్టాన్ని దాటాల్సి వచ్చినప్పుడు ఆదుకోవడానికి ఒకరు తోడుండాలి అంటారు. అందులో మహిళలకైతే చెప్పనక్కర్లేదు. కానీ కోల్‌కతాకు చెందిన రూప చౌదరికి పదేండ్ల బాబు తప్ప ఎవరూ లేరు. ఇప్పుడు ఆమె బతుకాలి, భవిష్యత్తుగా ఉన్న బాబును బతికించాలి. అందుకే ఆమె జీవనోపాధి మీద దృష్టిపెట్టింది. పురుషులు చేసే పనుల్లోనూ చేరి సవాళ్లను ఎదుర్కొంటున్నది. ఇటీవల ఓ ఫుడ్ డెలివరీ సంస్థలో కోల్‌కతాలో మొదటి డెలివరీ గర్ల్‌గా ఈమె వార్తల్లోకి ఎక్కింది. రూప చిన్న వయస్సుల్లోనే తల్లిదండ్రులు, అక్కలు చనిపోయారు. తర్వాత బంధువుల ఇంట్లో ఉండి పెరిగింది. అప్పుడే పెండ్లయింది. బాబు పుట్టిన కొన్ని రోజులకు రూప దంపతుల మధ్య గొడవలు అయ్యాయి. భర్త దూరంగా వెళ్లిపోయాడు. రూప ఒంటరిదైంది. దీంతో రూప ఉపాధి కోసం అనేక మార్గాలు అన్వేషించింది. ఇటీవలే ఫుడ్ డెలివరీ గర్ల్‌గా చేరింది. రూప ఇలాంటి పని చేయడం మొదటిసారేం కాదు. గతంలో ఓ క్యాబ్ సంస్థలో కార్ డ్రైవర్‌గా, బైక్ రైడర్‌గా పని చేసింది. ఇటీవల కోల్‌కతాలో ఓ ఫుడ్ డెలివరీ సంస్థ మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో అందులో చేరింది రూప.

603
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles