నిశ్శబ్దంపై అవగాహన


Wed,June 12, 2019 01:13 AM

ఢగ ఢగ ఢగ మంటూ ఓ ద్విచక్ర వాహనం వీధిలోకి వస్తే నిద్రపోతున్న పిల్లలు లేచి గుక్కపెట్టి ఏడిసేవాళ్లు. అది ఆ యువకుడికి పరమ చిరాకుగా అనిపించింది. బయటికి వెళ్తే ట్రాఫిక్‌లోనూ ఇదే లొల్లి. అవసరం లేకున్నా ఇష్టం వచ్చినట్లు కొట్టే హారన్ల చప్పుడు తట్టుకోలేకపోయేవాడు. ఇది అందరి సమస్యగా భావించి శబ్దకాలుష్యం తగ్గించేందుకు ఓ ప్రయత్నం చేశాడు. మార్పు సాధించాడు.
adhinarayanan
బెంగళూరుకు చెందిన ఆదినారాయణన్, భారతి దంపతులు. ఇద్దరు స్థానికంగా ప్రయివేటు ఉద్యోగాలు చేస్తున్నారు. తరచూ వాళ్లుండే వీధిలో పెద్ద శబ్దం చేస్తూ స్థానిక యువకులు వెళ్తుండేవారు. ఎన్నోసార్లు శబ్దం చేయవద్దని చెప్పినా అక్కడి యువకులు వారి మాట వినకపోయేవారు. ఒకరోజు వారి తల్లిదండ్రుల సమక్షంలో ఆదినారాయణ్, భారతి కౌన్సెలింగ్ ఇచ్చారు. అధిక శబ్దం వల్ల కలిగే అనర్థాలను వివరించారు. ఆ తర్వాత గొడవ సద్దుమణిగినప్పటికీ ఆ దంపతుల్లో నిరాశే ఉండేది. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద, హైవే మీద ఇలా ఎక్కడ పడితే అక్కడ శబ్ద కాలుష్యం పెరుగుతూనే ఉందని వారు గ్రహించారు. శబ్ద కాలుష్యం తగ్గించేందకు జూలై 2016లో కోయంబత్తూర్ నుంచి బెంగళూరు, కేరళ తదితర ప్రాంతాలను చుట్టివచ్చారు. హారన్ వాడకుండా తమ జీప్‌లో 15 వేల కిలోమీటర్లు ప్రయాణించారు. తాము ప్రయాణిస్తున్న మార్గంలో వేలాది కూడళ్ల వద్ద, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద హారన్ వాడకంపై అవగాహన కల్పించారు. హారన్ అవసరం మేరకే వాడలని లేబుల్స్‌ను వాహనాలపై అంటించారు. సిగ్నల్స్ పడిన సమయంలో వాహనదారులకు శబ్దకాలుష్యంపై అవగాహన కల్పించారు. వీరి ప్రయత్నం ఎంతోమందిలో మార్పు తెచ్చింది.

78
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles