సాల్సా నృత్యంతో ఖ్యాతి!


Sun,June 9, 2019 12:55 AM

ముంబైకి చెందిన ఇద్దరు నృత్యకారులు అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఎక్కడో విదేశాల్లో పుట్టిన సాల్సా డ్యాన్స్ నేర్చుకొని మన దేశానికే ఖ్యాతి తెచ్చారు.
salsa-dance-duo
ముంబైకి చెందిన ఎల్విస్ మస్కరెన్హాస్, నమ్రతా విట్కేలిద్దరూ డ్యాన్సర్లు. వీరు ప్రపంచస్థాయిలో జరిగిన అతిపెద్ద డ్యాన్స్ చాంపియన్‌షిప్ పోటీల్లో భారతదేశం తరపున విజయం సాధించారు. దేశమంతా గర్వపడే విధంగా కీర్తిప్రతిష్టలు తీసుకొచ్చారు. ఎల్విస్ మస్కరెన్హాస్ అనే సామాన్య మధ్యతరగతి కుర్రాడికి మొదట్లో సల్సా డ్యాన్స్ తెలియదు. గణపతి నిమజ్జన కార్యక్రమంలో భాగంగా ఎల్విస్ ఉండే కాలనీలో యు గాట్ సర్డ్ అనే నాటకం వేశారు. అందులో ఓ సన్నివేశంలో సాల్సా డ్యాన్స్ వేయడం చూశాడు. అప్పటి నుంచి సాల్సా డ్యాన్స్ నేర్చుకోవాలనే ఆసక్తి పెరిగింది.

కాలేజ్‌లో హిప్‌హాప్ నేర్చుకొని డ్యాన్స్ పోటీల్లో చాలా బహుమతులు గెలుపొందాడు. కొద్ది రోజుల తర్వాత నమ్రతా విట్కే అనే డ్యాన్సర్.. ఎల్విస్ మస్కరెన్హాస్‌తో చేయి కలిపింది. దాదాపు ఎనిమిదేండ్ల పాటు ఇద్దరూ కలిసి సాల్సా డ్యాన్స్ బాగా ప్రాక్టీస్ చేశారు. మియామీలో వరల్డ్ డ్యాన్స్ సమ్మిట్ జరిగింది. ఇందులో 45 దేశాల నుంచి వచ్చిన టాప్ డ్యాన్సర్లు పాల్గొన్నారు. భారత దేశం తరపున మెన్స్ సోలో రైజింగ్ స్టార్ విభాగంలో ఎల్విస్ మస్కరెన్హాస్ బంగారు పతకాన్ని సాధించాడు. నమ్రతా విట్కే ఫ్ట్రీైస్టెల్ విభాగంలో రన్నరప్‌గా నిలిచింది. వీరిద్దరూ తొలిసారిగా భారతదేశానికి వన్నె తెచ్చారు.

761
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles