సలామ్ సర్దార్ జీ!


Sun,June 9, 2019 12:51 AM

ఢిల్లీకి చెందిన ఈ వృద్ధుడి ప్రయాస చూస్తే.. ఎవరైనా సలామ్ కొట్టాల్సిందే. ఠారెత్తిస్తున్న ఎండలకు బయటికి రావాలంటేనే జనం భయడుతున్నారు. అలాంటిది ఈ వృద్ధుడు మండుటెండల్లో కూడా ప్రయాణికుల దాహం తీర్చుతున్నాడు.
delho-old-man
ఢిల్లీలో ప్రతీ రోజు 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఈ క్రమంలో స్థానికుడైన సర్దార్ మొబైల్ చలివేంద్రం ఒకటి ఏర్పాటు చేశాడు. స్కూటీపై నీళ్ల డబ్బాలు పెట్టుకొని జనం ఉన్నచోటికే వెళ్లి నీళ్లు అందిస్తున్నాడు. సర్దార్ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. స్కూటీపై జనం సంచరించే స్థలాల్లో, ప్రధాన వీధుల్లో తిరిగి నీటిని అందిస్తున్నాడు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు గల్లీ గల్లీ తిరుగుతాడు. దాహం అన్న వారి గొంతు తడుపుతాడు.

రోజుకు వంద రూపాయల పెట్రోలు ఖర్చు పెట్టుకొని మరీ మొబైల్ చలివేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. ఇదంతా ఎందుకు చేస్తున్నావని స్థానిక యువకుడు సర్దార్‌ను ప్రశ్నిస్తే.. ఎండాకాలంలో సమయానికి నీళ్లు అందక ఏటా వందల మంది చనిపోతున్నారు. నేను చేసే ఈ కార్యక్రమం ద్వారా ఒక్కరు బతికినా చాలు అని చెబుతున్నాడు సర్దార్. ఇతని సేవలను వీడియో తీసిన ఓ యువకుడు సోషల్ మీడియాలో షేర్ చెయ్యడంతో.. నెటిజన్లు సలాం కొడుతున్నారు.

1152
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles