ఎండ నుంచి ‘ఫేస్‌కిని’ రక్ష!


Sun,June 9, 2019 12:49 AM

ఈ చిత్రంలో కనిపిస్తున్నది గ్రహాంతరవాసులు కాదు, అలాగని అక్కడ ఫ్యాషన్ షో కూడా జరగడం లేదు. వారు సీరియస్‌గానే ఆ మాస్కులు, దుస్తులు ధరించారు. ఎందుకని ప్రశ్నిస్తే.. ఎండ తీవ్రత వల్ల చర్మంపై బొబ్బలు రాకుండా ఉండేందుకు అంటున్నారు.
Facekini-Sute
ప్రస్తుతం చాలా దేశాల్లో ఫేస్‌కిని ట్రెండ్ నడుస్తున్నది. వేసవి నుంచి చర్మాన్ని కాపాడుకునేందకు ఈ తరహా దుస్తులను వినియోగిస్తున్నారు. ఇవి చూడటానికి స్విమ్‌సూట్స్‌లా కనిపిస్తున్నా.. కొన్ని దశాబ్దాల నుంచి వాడుతున్నారట. చైనాలోని కింగ్‌దావో నగరంలో ఎక్కడ చూసినా ప్రజలు ఇలాంటి మాస్కుల్లోనే కనిపిస్తారు. తల మీద నుంచి మొత్తం ముఖాన్ని కవర్ చేసే ఈ మాస్క్‌లు ఒకప్పుడు సాధారణ రంగుల్లోనే లభించేవట. కాలక్రమేనా రూపు రేఖలు మార్చుకుని ఇప్పుడు రంగు రంగుల్లో లభ్యమవుతున్నాయి. బీచ్‌లో వేసుకునే ఈ మాస్కు డ్రస్‌లను రబ్బర్ లేదా లైక్రాతో తయారు చేస్తారు. జెల్లీ ఫిష్, నెమలి, డ్రాగాన్ ఇలా రకరకలా డిజైన్లతో ఈ సన్‌బర్న్ మాస్క్‌లు, డ్రస్‌లు లభ్యమవుతున్నాయి. వీటిని చైనాలో మాత్రమే కాదు.. ఆస్ట్రేలియా, ఆగ్నేయ ఆసియాల్లో కూడా ఈ తరహా మాస్క్ డ్రస్‌లను ధరిస్తున్నారు. కావాలంటే వీటిని ఆన్‌లైన్‌లో కూడా కొనుగోలు చేయొచ్చు.

1108
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles