నర్మద పరిక్రమ


Fri,June 7, 2019 01:15 AM

ఏవీ శాశ్వతం కావు!
(గత సంచిక తరువాయి)
Narmada
పై రెండు సందర్భాల్లో ఒక దాన్ని ఉంచుకోవాలన్న తపన ఉంది. ఆ యువతి డైమండ్ నెక్లెస్‌ను, బ్రాహ్మణుడు తన బ్రాహ్మణత్వాన్ని మరణించే దాకా శాశ్వతంగా తమతోనే ఉంచుకోవాలని అనుకొన్నారు. ఈ రెండు సందర్భాలలో శాశ్వతంగా కోరుకున్నవి వారిని విడిచి వెళ్లిపోయాయి. వజ్రం కాని, కులం కాని, ప్రపంచంలోని ఎవరైనా తమకు శాశ్వతంగా ఉండాలని కోరుకొనే మరేదైనా కానీ.. ఏదీ శాశ్వతంగా మన దగ్గర ఉండదు. మన మనసులోని ఓ భాగంలో అవి నావి అని భావిస్తుంటాం. నాది అన్న ఆ భావనలను అన్నింటినీ మనం కనుక పోగొట్టుకోగలిగితే, అప్పుడు శాశ్వతమైన సద్వస్తువు మనకు దక్కుతుంది. జీవితం అనే నదిచుట్టూ మనం పరిక్రమ చేస్తూ ఉంటాం.

మనుషులు వస్తారు, వెళ్తారు. కొన్ని వస్తువులను మనవి అనుకొంటాం. కొద్ది కాలానికి అవి మనవి కాకుండా పోయాక కూడా ఇంకా అవి మనవే, పోయాయి అనుకొంటాం. అంతటితో అవి మనవి కావు కాబట్టే, పోయాయి అన్న సత్యాన్ని అర్థం చేసుకోగలిగితే ఏ బాధా ఉండదు. నర్మద నది పరిక్రమలో భిల్లులు ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని బోధించే పాత్రను పోషిస్తారు. సన్యాసాశ్రమ స్వీకారం తర్వాత ఉత్తర భారతదేశంలోని సన్యాసులు చాలామంది నర్మద పరిక్రమను కాలి నడకన చేస్తుంటారు. ఇది వారు వైరాగ్యాన్ని ఒంట పట్టించుకోవడానికే అయుండవచ్చు.

మల్లాది వెంకట కృష్ణమూర్తి

narmada4
మా బస్‌లో ఓ మధ్యాహ్నం ఐలారి అనే గ్రామం మీంచి వెళ్లేపుడు రోడ్డుమీద కొందరు భిల్లులను చూశాను. మామూలు దుస్తుల్లో వాళ్లు చూడటానికి సామాన్యంగానే ఉన్నారు. నేను రచయితనని, నర్మదా యాత్రను అక్షరబద్ధం చేస్తానని వెంకటేశ్వరరావు ముందే దేశాయ్‌కు చెప్పడం వల్ల ఆయన నాకు ఇది రాయి మూర్తీ అంటూ ఆయా సందర్భాలలో యాత్ర పొడుగునా చాలా విషయాలను.. ఇలా వివరిస్తూ పోయారు. మహారాష్ట్ర ఆచారాలను కూడా చాలావరకు చెప్పారు. ఉదయం ఏడున్నరకు శ్రీమతి దేశాయ్ ఎదురు రాగా, మా బస్ బయల్దేరింది. వెంటనే గణపతి పప్పా, మోరియా అంటూ వంటమనిషి పుష్పా మౌసి అరిచింది. మా యాత్రలో బస్ బయలు దేరినప్పుడల్లా ఈవిడ గణపతి పప్పా, మోరియా అంటూ అరవడం ఒక్కసారి కూడా మరిచిపోలేదు.

తీర్థయాత్ర

narmada5
సిటీ ట్రాఫిక్ మొదలవకుండానే ముంబై నగరం నుంచి బయట పడాలన్నది దేశాయ్ తలంపు. కొద్దిదూరం వెళ్లాక కుడివైపు ఉదయించే సూర్యబింబం బంగారు రంగులో డిస్క్‌లా కనిపించింది. ఉత్తరదిక్కుకు మా ప్రయాణం సాగింది. బస్‌లో దేశాయ్, ఆయన కొడుకు కాకుండా ట్రావెల్స్ తరఫున వంటమనిషి పుష్పా మౌసి, ఇద్దరు సేవకులు కూడా ఉన్నారు. బస్ సిటీ లిమిట్స్ దాటాక వారిలోని జగ్గు, మరొకతను లేచి, తెల్లవారు ఝామున ఇంటి దగ్గర వండి తెచ్చిన ఉప్మాను డిస్పోజబుల్ ప్లేట్లలో అందరికీ బ్రేక్‌ఫాస్ట్‌గా సర్వ్ చేశారు. ఇంకా కావాలా? అని అడిగి రెండోసారి కూడా పెట్టారు. తర్వాత ఓ చోట బస్‌ను ఆపి పుష్ప మౌసి స్టవ్‌మీద టీని తయారుచేస్తే అంతా వేడివేడి టీ తాగారు. వెంకటేశ్వరరావుకు, నాకు.. కాఫీ, టీలు అలవాటు లేదు కాబట్టి, ఈ యాత్రలో మేం వాటిని తీసుకోలేదు.

తొలి షిరిడీ యాత్ర

ఉదయం పదకొండుకు మా బస్ నాసిక్‌కు చేరి హైవేలో వెళుతుండగా, ఎడమ వైపు ఓ కాంపౌండ్ వాల్ గేటుకు ఉన్న హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అన్న బోర్డు కనిపించింది. నేను మెంబర్, ఆడిట్ బోర్డ్ అండ్ ఎక్స్ అఫీషియా డైరెక్టర్ ఆఫ్ కమర్షియల్ ఆడిట్ అనే కేంద్ర ప్రభుత్వ కార్యాలయంలో సీనియర్ ఆడిటర్‌గా పనిచేస్తున్నపుడు, 1973లో ఇక్కడికి ఆడిట్‌కు కొందరు కొలీగ్స్‌తో కలిసి వచ్చిన సంగతి.. అప్పుడు నాకు గుర్తుకు వచ్చింది. ఆ ఆవరణలోని కంపెనీ గెస్ట్ హౌస్‌లోనే అప్పుడు మేం బస చేశాం. ఓ ఆదివారం నేను, మా సెక్షన్ ఆఫీసర్లు జగ్గయ్య, సత్యనారాయణ, ఆడిట్ ఆఫీసర్ సత్యనారాయణ త్య్రయంబకేశ్వర్ ఆలయానికి, గోదావరి నది పుట్టిన బ్రహ్మగిరికి హెచ్‌ఏఎల్ కారులో వెళ్లాం. మరో ఆదివారం ఆర్‌టీసీ బస్‌లో షిరిడీ వెళ్లాం. షిరిడీ గుడి అప్పట్లో చాలా చిన్నది అని నాకు స్పష్టంగా గుర్తుంది.

సాయిబాబా పేరు వినడం తప్ప, నాకు అప్పట్లో పెద్దగా భక్తి ఉండేది కాదు. సెప్టెంబర్ 1999లో దైవఘటనగా నేను ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాక, ఓసారి శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టారి జీవితచరిత్రను చదివాను. ఆయనలో ఆధ్యాత్మిక మేలుకొలుపు షిరిడీ ధర్శించాకే జరిగిందని తెలుసుకొన్నాక, నాకు షిరిడీ సాయిబాబా మీద చాలా కోపంగా ఉండేది. ఆ ఏడాది సెప్టెంబర్‌లో మూకాంబికా తల్లి నన్ను ఆధ్యాత్మిక మార్గంలోకి నడిపించినట్లుగా బాబా 1973లోనే ఆయన దర్శనానికి వెళ్లినప్పుడే నాలో మార్పును ఎందుకు తేలేదు? భరద్వాజ మాస్టారి మీద చూపించిన అనుగ్రహాన్ని నాపైన బాబా ఎందుకు చూపించలేదు? షిరిడీ గుడి అప్పట్లో చాలా చిన్నది అని నాకు స్పష్టంగా గుర్తుంది. సాయిబాబా పేరు వినడం తప్ప, నాకు అప్పట్లో పెద్దగా భక్తి ఉండేది కాదు.

* షిరిడీ గుడి అప్పట్లో చాలా చిన్నది అని నాకు స్పష్టంగా గుర్తుంది. సాయిబాబా పేరు వినడం తప్ప, నాకు అప్పట్లో పెద్దగా భక్తి ఉండేది కాదు.

-సశేషం

992
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles