ధర్మమార్గమే శ్రేయస్కరం


Fri,June 7, 2019 01:10 AM

Jeevana-Vedam
అగ్నిని ఆశ్రయించి 33,342 తత్వాలున్నాయి. వాటిని తెలుసుకొని మానవులు సకల కార్యాలను సిద్ధింపజేసుకోవాలె. విద్వాంసులైన వారంతా పవిత్ర హృదయులుగా ఉండాలి. వారే మిగతా వారికి విద్యను, విజ్ఞానాన్ని ఉత్తమ శిక్షణ ద్వారా అందిస్తూ అందరినీ పవిత్రులను చేయాలి. ఈ రకంగా లోకంలోని మానవులంతా పవిత్రులవడం ద్వారా సుఖాలను పొందడానికి కావలసిన సామర్థ్యాల్ని సముపార్జించుకోవాలి. విద్వాంసులు మాత్రమే విద్వాంసుల శ్రమను గుర్తించగలుగుతారు. కనుక, విద్వాంసులను విద్వాంసులే సత్కరించాలె. సర్వాంతర్యామి అయిన పరమేశ్వరుని ఆజ్ఞ మేరకే సూర్యచంద్రాది గ్రహాలు, సమస్త సృష్టీ నియమం ప్రకారం నిర్దుష్ట మార్గంలో సంచరిస్తున్నాయి. ఇదే విధంగా మానవులందరూ ధర్మమార్గంలోనే నడువాలె. అదే లోకానికి శ్రేయస్కరం, క్షేమకరం కూడా.
- ఋగ్వేదం

771
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles