బిడ్డకు ప్రేమతో..పిల్లలకు సెల్‌ఫోన్


Wed,June 5, 2019 01:03 AM

కనిపిస్తే చాలు. అతుక్కుపోతున్నారు. కానీ వాళ్లు ఆడాల్సింది ఫోన్లో కాదు. గార్డెన్స్‌లో అని ఓ నాన్న ఏం చేశాడో తెలుసా?
Edward-Emmanuel
చెన్నైకి చెందిన ఎడ్వర్డ్ ఎమాన్యుయేల్ ఎల్తాం తన చిన్నారి కూతురును ఆరుబయట ఆడించాలి అనుకున్నాడు. కానీ బయటంతా ఎండ దంచి కొడుతున్నది. నిలువ నీడ లేదు. ఇక తన కూతుర్ని ఎలా ఆడించేది అనుకొన్నాడు. స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చెట్లు పెంచి దానిని పండ్ల తోటగా మార్చాలి అనుకున్నాడు. ప్రధానోపాధ్యాయుడి అనుమతి తీసుకొని మొక్కలు నాటేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే తాను చేసే పని తనలాంటి యువకులను ఆలోచింపజేసేదిగా ఉండాలని భావించి వెయ్యి మొక్కల కోసం విరాళాలు సేకరిస్తూ మొక్కల పెంపకం పట్ల ప్రచారం చేస్తున్నాడు. ఫాదర్స్‌డే వరకు ఈ కార్యక్రమాన్ని పూర్తిచేసి వెయ్యి పండ్ల మొక్కలు నాటి తన చిన్నారి కూతురుకి ఈ చిట్టి గార్డెన్‌ను బహుమతిగా ఇచ్చేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు.

2512
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles