బైకింగ్ క్వీన్స్ ప్రపంచ యాత్ర..


Wed,June 5, 2019 12:59 AM

మహిళలు తమలో ఉన్న శక్తిని తెలుసుకోవడంలో వెనుకబడి ఉన్నారు. ఈ పరిస్థితి మన దేశంలోనే కాదు అనేక దేశాల్లో ఉంది. ఆమెకు సరైన రక్షణ కావాలి. సరైన గౌరవం కావాలి ఇదే నినాదంతో బైకింగ్ క్వీన్స్ ప్రపంచ యాత్ర ప్రారంభించారు. మూడు నెలల్లో 25 వేల కిలోమీటర్లు ప్రయాణించనున్నారు.
sarika1
డాక్టర్ సారిక మెహతా, జినాల్ షా, రుతాలి పటేల్ అనే ముగ్గురు మహిళలు ప్రపంచవ్యాప్త అవగాహన యాత్రకు దిగారు. మహిళ గౌరవాన్ని కాపాడాలనే సందేశాన్ని ఇస్తూ బైక్ యాత్ర చేస్తున్నారు. గుజరాత్‌కు చెందిన డాక్టర్ సారిక బైకింగ్ క్వీన్స్ ఆర్గనైజేషన్‌ను స్థాపించారు. గతంలో 45 మంది మహిళలతో మనదేశంలో బైక్ యాత్ర నిర్వహించారు. అదే అనుభవంతో ఇప్పుడు ఈ ప్రపంచ యాత్రకు స్ధిమయ్యారు. ఈరోజు నుంచి వారణాసి నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. రోజుకు 500-600 కిలో మీటర్ల ప్రయాణం, వివిధ రకాల భూభాగాలను తాకుతూ వివిధ దేశాలను దాటుతూ వెళ్లనున్నారు. మొత్తం 90 రోజుల్లో 25 దేశాల్లో పర్యటిస్తారు. ఆగస్టు 25 నాటికి లండన్‌లో ఈ యాత్ర ముగుస్తుంది. నేపాల్, మయన్మార్, థాయ్‌లాండ్, లావోస్, కిర్గిజిస్థాన్, ఉజకిస్థాన్, కజకిస్థాన్, రష్యా, లుథియానా, బెలారస్, పోలాండ్, జెకోస్లోవేకియా, జర్మనీ, లండన్, ఆస్ట్రేలియా, స్విడ్జర్లాండ నెదర్లాండ్, బెల్జియం, ఫ్రాన్స్, స్పెయిన్, మొరాకో దేశాల్లో ప్రయాణిస్తారు. ఈ యాత్రలో మేం శారీరకంగా, మానసికంగా ఎంతో ధృడంగా ఉండాలనీ, మహిళల్లో అవగాహన పెంచేందుకు మేము కృషి చేస్తున్నాం అని సారిక చెపుతున్నారు.
sarika

393
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles